విలన్‌గా చేయక ఇంకేం చేస్తాడు?

Update: 2015-07-07 07:29 GMT
ఒక గొప్ప నటుడికి వారసుడైనంత మాత్రాన ఆ నటుడు కూడా ఆ స్థాయికి వెళ్లిపోతాడనుకుంటే పొరబాటే. దీనికి ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. అమీర్‌ ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలోనూ ఇది రుజువవుతోంది. అమీర్‌ కొడుక్కి హీరో అయ్యే ఆశలేమీ లేవు కాబట్టి.. ఇమ్రాన్‌నే అమీర్‌ నట వారసుడిగా చెప్పుకోవాలి. 'జానె తు యా జానేనా' లాంటి క్లాసికల్‌ హిట్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అమీర్‌. కుర్రాడు బాగానే నటించాడు.. సినిమా కూడా సూపర్‌ హిట్టయింది కాబట్టి మంచి రేంజికి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ మనోడి అసలు టాలెంట్‌ ఏంటో తర్వాత తర్వాత తెలిసింది.

నటుడిగా ఏమాత్రం వైవిధ్యం చూపించకపోవడం.. ఫేస్‌ వాల్యూ లేకపోవడంతో రాను రాను జనాలు అతణ్ని పట్టించుకోవడం మానేశారు. ఢిల్లీ బెల్లీ మినహాయిస్తే గత ఐదేళ్లలో మనోడికి ఒక్క హిట్టూ లేదు. ఆ సినిమా కూడా దర్శకుడి ప్రతిభతోనే ఆడింది తప్పితే అందులో మనోడు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అమీర్‌ మేనల్లుడని ఏదో అవకాశాలైతే ఇస్తున్నారు కానీ.. సినిమాలైతే ఆడట్లేదు. బాలీవుడ్‌లో ఏ నటులు సినిమాలు మానేస్తే బాగుంటుందంటూ అప్పుడప్పుడూ పోల్స్‌ అవీ నిర్వహిస్తుంటారు. అందులో అభిషేక్‌ బచ్చన్‌తో పాటుగా కచ్చితంగా కనిపించే పేర్లలో 'ఇమ్రాన్‌' కూడా ఉంటుంది. ఇప్పటికే మనోడికి సోలో హీరో అవకాశాలు ఆగిపోయాయి. ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి బండి లాగిస్తున్నాడు. తాజాగా విలన్‌ వేషం వేయడానికి కూడా ఒప్పేసుకున్నాడు అమీర్‌ మేనల్లుడు. ఢిల్లీ బెల్లీ దర్శకుడు అభినయ్‌ డియో రూపొందిస్తున్న ఫోర్స్‌-2లో జాన్‌ అబ్రహాంకు విలన్‌గా నటించబోతున్నాడు ఇమ్రాన్‌. కానీ భారీకాయుడైన జాన్‌కు అమీర్‌ విలన్‌గా సెట్టవుతాడా అన్నదే డౌటు.

Tags:    

Similar News