చిరు మంచితనం.. ఆన్సర్ అదిరింది బాసు..!

Update: 2023-01-12 05:28 GMT
మెగాస్టార్ చిరంజీవి అందరివాడు. ఇది కేవలం ఆయన సినిమా టైటిల్ గానే కాదు సినీ పరిశ్రమలో అందరికి కావాల్సిన వాడు అన్న పేరు ఉంది. స్వయంకృషితో తన టాలెంట్ ను నమ్ముకుని స్టార్ గా ఎదిగిన వ్యక్తి ఆయన. చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని సినిమా పరిశ్రమకు వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. మెగాస్టార్ గా అశేష అభిమాన హృదయాలను గెలుచుకున్న చిరంజీవి పరిశ్రమలో కూడా అందరికి మంచి చేస్తూ వస్తుంటాడు. అందరితో మంచిగా ఉంటూ అందరితో పద్ధతిగా మాట్లాడుతూ వస్తుంటాడు.

చిరు అతి మంచితనం మీద రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకున్నారు. తనని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన వారిని కూడా పోనీలే అంటూ వదిలేస్తాడు. అసలు చిరు ఇలా ఎందుకు చేస్తాడు అంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎదురు తిరిగితే తన ఈగో చల్లారుతుందేమో కానీ తన సినిమా భారీగా నష్టం జరుగుతుందని.. దాని వల్ల అభిమానులు నిరాశ పడతారని అందుకే తను సైలెంట్ గా ఉంటానని.. తన సంయమనం మంచి చేస్తుందనే తాను వెనక్కి తగ్గుతానని అన్నారు చిరు. సమస్య ఏదైనా ఫైనల్ గా రిజల్ట్ సానుకూలంగా రావడమే ముఖ్యం కదా అని అన్నారు.

సంక్రాంతి రేసులో వాల్తేరు వీరయ్య చివరగా రావడం పట్ల కూడా చిరు స్పందించారు. మైత్రి మేకర్స్ నుంచే రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా విజయం సాధిస్తుంది.. బయ్యర్లు, ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని అందరికీ మంచి జరిగేలా ఈ రిలీజ్ డేట్లు అనుకున్నామని అన్నారు చిరు. ఇక చిరు దర్శకత్వం కూడా చేయాలని ఉందన్న ఆలోచన బయట పెట్టారు. తనపై తనకు నమ్మకం కలిగినప్పుడు తప్పకుండా దర్శకుడిగా మారుతానని అన్నారు.

ఇక వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా లో చిరుతో పాటుగా మాస్ మహరాజ్ రవితేజ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమా లో శృతి హాసన్, కేథరిన్ త్రెసా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ బజ్ క్రియేట్ చేశాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News