దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఎపిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'సీతారామం'. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలైన యునానిమస్ గా ఎపిక్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
దర్శకుడు హను రాఘవపూడికి హిట్ లు లేకపోవడంతో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఊహించని విధంగా అన్ని వర్గాల ప్రశంసల్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
పీరియాడిక్ ఫిక్షనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీకి విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దర్శకుడు హను రాఘవపూడి కెరీర్ లోనే అత్యుత్తమమైన సినిమాగా ప్రశంసలు అందుకుంది. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్, సీతగా, ప్రిన్స్ నూర్జహాన్ గా మృణాల్ ఠాకూర్ అభినయం, వీరిద్దరి కోసం వెతికే పాకిస్థానీ యువతి అఫ్రీన్ గా రష్మిక మందన్నల నటన ప్రతీ ఒక్కరినీ కట్టిపడేసింది.
ఆగస్టు 5న థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నా సెప్టెంబర్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
డిజిటల్ వరల్డ్ లోనూ సత్తా చాటుతున్న ఈ మూవీ యుఎస్ లో మాత్రం ఇప్పటికీ తన సత్తాని చాటుతూ డ్రీమ్ రన్ ని కొనసాగిస్తోంది. అక్కడ ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు.
ఓవర్సీస్ లో మరీ ముఖ్యంగా యుఎస్ లో ఈ మూవీని అత్యధికంగా 36 లొకేషన్ లలో రిలీజ్ చేశారు. ఇలా విడుదలైన తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం అని అక్కడి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే తాజాగా మరో 14 లొకేషన్స్ లో ఈ మూవీని విడుదల చేయడం విశేషం. ఓటీటీలో విజయ పరంపర కొనసాగిస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ యుఎస్ లో రికార్డు స్థాయి లొకేషన్ లలో రిలీజ్ కావడం రికార్డుగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.