భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే ఇప్పుడు రాజమౌళి.. శంకర్ అని రెండు పేర్లు చెప్తున్నారు కానీ గతంలో శంకర్ పేరు ఒక్కటే చెప్పేవారు. శంకర్ ఎప్పుడు సినిమా తీసినా ఆ బడ్జెట్ పెద్ద స్టార్ హీరోలు నటించే నాలుగు సినిమాల బడ్జెట్ కు సమానం. శంకర్ లాస్ట్ సినిమా '2.0' బడ్జెట్ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం శంకర్ మాత్రం తన శైలికి భిన్నంగా 'ఇండియన్ 2'(భారతీయుడు 2) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువేమీ కాదు కానీ భారీ బడ్జెట్ సినిమా అయితే కాదు.
కమల్ హాసన్ హీరోగా 23 ఏళ్ళ క్రితం తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా 'ఇండియన్' సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జరుగుతోందని సమాచారం. కమల్ తో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారట. ఈ షెడ్యూల్ లో కమల్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను శంకర్ తెరకెక్కిస్తున్నారట. రాజమండ్రి షెడ్యూల్ పూర్తయిన తర్వాత జరగబోయే నెక్స్ట్ షెడ్యూల్ ను 'ఇండియన్ 2' టీమ్ విదేశాల్లో ప్లాన్ చేశారట.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ .. రకుల్ ప్రీత్ సింగ్.. సిద్ధార్థ్.. ఐశ్వర్య రాజేష్.. ఆదిత్య రాయ్ కపూర్.. విద్యుత్ జమ్వాల్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.