ఇండియన్ సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఆడిన సందర్బాలు చాలా ఉన్నాయి. వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అంటూ ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లను కూడా రాబట్టాయి. బాహుబలి మరియు దంగల్ సినిమాలు హాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ తో పోటీ పడ్డాయి. అలాంటిది గత ఏడాది వచ్చిన ఏ ఇండియన్ సినిమా కూడా 350 కోట్ల వసూళ్లను రీచ్ కాలేదు. కాని ఇండియాలో విడుదలైన హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ మాత్రం ఏకంగా 375 కోట్ల వసూళ్లను సాధించింది.
ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇండియాలో హాలీవుడ్ సినిమా ఇండియన్ సినిమా కలెక్షన్స్ ను బీట్ చేయలేదు. కాని ఈసారి ఇండియన్ చిత్రాల్లో టాప్ గా నిలిచింది వార్ మరియు సాహోలు మాత్రమే. ఈ రెండు సినిమాల్లో వార్ సినిమా 320 కోట్లు వసూళ్లు చేయగా సాహో చిత్రం 300 కోట్లను వసూళ్లు చేసింది. ఇండియన్ సినిమా వసూళ్లను ఒక హాలీవుడ్ మూవీ ఇండియాలో బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాకు ఇది దారుణమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు.
2019 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలు విడుదల అయినా కూడా కొన్ని దారుణమైన పరాజయం పాలయ్యాయి. కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. కొన్ని మాత్రమే ఇలా రెండు వందల కోట్లను దాటి మూడు వందల కోట్లల్లో పడ్డాయి. మరి 2020 సంవత్సరంలో అయినా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇండియన్ మూవీ నెం.1 గా నిలుస్తుందా చూడాలి. అవెంజర్స్ స్థాయి హాలీవుడ్ మూవీ వస్తే ఈసారి కూడా ఇండియాలో అదే టాప్ లో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ ఏడాది రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రాబోతుంది కనుక ఇండియన్ సినిమా టాప్ లో నిలిచే అవకాశం ఉందని కొందరు సౌత్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.