`మ‌హ‌ర్షి` సందేశంపై తెలుగు క్రికెట‌ర్ ప్ర‌శంస‌

Update: 2019-07-23 09:58 GMT
మ‌హేష్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన `మ‌హ‌ర్షి` ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌కుల్లో మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా అదేదీ వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూప‌లేదు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో వీకెండ్ వ్య‌వ‌సాయం అన్న కాన్పెస్ట్ అంద‌రికీ న‌చ్చింది. మ‌హ‌ర్షి చిత్రం చూశాక ప‌లు కార్పొరెట్ కంపెనీల‌ ఉద్యోగులు వీకెండ్ వ్య‌వ‌సాయం పేరుతో పొలాల‌కు వెళ్లి బోలెడంత హంగామా చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమాపై ప‌లువురు టాలీవుడ్ స్టార్లు .. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌శంస‌లు కురిపించారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. ఇది ఒక సాహ‌సోపేత‌మైన‌ ప్ర‌య‌త్నం అంటూ మ‌హేష్ - వంశీ- దిల్ రాజు టీమ్ ని ప్ర‌శంసిస్తూ ప‌లువురు ఉద్వేగ‌పూరిత లేఖ‌లు రాశారు. మ‌హ‌ర్షి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100 కోట్ల షేర్ .. 150 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ రిపోర్ట్ అందింది. మ‌హ‌ర్షి 50 రోజుల వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని భావించినా విజ‌య‌నిర్మ‌ల ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా టీమిండియాకు టాప్ క్లాస్ బ్యాట్స్ మ‌న్ గా విశేష సేవ‌లందించిన‌ తెలుగు కుర్రాడు.. జెంటిల్ మేన్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ `మ‌హ‌ర్షి` సినిమాని వీక్షించి ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమాలో బ‌ల‌మైన సందేశాన్ని అద్భుతంగా క‌న్వే చేశార‌ని.. స్ఫూర్తివంత‌మైన‌ ముఖ్య‌మైన సందేశం అందించార‌ని చిత్ర‌యూనిట్ ని అభినందించారు. మ‌హేష్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంసించారు. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ట్వీట్ కి ప్ర‌తిస్పందించిన మ‌హేష్ `థాంక్యూ వెరీమ‌చ్ స‌ర్.. మీకు న‌చ్చినందుకు` అని రిప్ల‌య్ ఇచ్చారు. మ‌హేష్ ప్ర‌స్తుతం `స‌రిలేరు నీకెవ్వ‌రు` కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడు నాలుగు భారీ సెట్లు వేశారు. రామోజీ ఫిలింసిటీ- అన్న‌పూర్ణ స్టూడియోస్ లో కీల‌క షెడ్యూల్ ని తెర‌కెక్కించ‌నున్నారు.


    

Tags:    

Similar News