దుబాయి జైల్లో హిందీ సింగర్‌.. శిక్ష తప్పదా?

Update: 2018-12-08 14:24 GMT
బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు మికా సింగ్‌ కొన్ని రోజుల క్రితం ఒక బాలీవుడ్‌ ఈవెంట్‌ కోసం దుబాయి వెళ్లడం, అక్కడ ఒక బ్రెజిల్‌ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి విషయాలు ముంబయి వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే. మికా సింగ్‌ పై నమోదు అయిన కేసు చిన్నదే అని, వెంటనే వచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కాని దుబాయిలో ఇలాంటి కేసులు చాలా సీరియస్‌ గా తీసుకుంటారు. దుబాయి కోర్టు ముందుకు వెళ్లిన మికా సింగ్‌ కేసు ను న్యామూర్తులు తీవ్రంగా పరిగణించారు.

ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దేశం పరువు పోయేలా మికా సింగ్‌ చర్య ఉందని కోర్టు అభిప్రాయ పడినది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించినట్లు గా మికా సింగ్‌ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం మికా సింగ్‌ సన్నిహితులు ఆ బ్రెజిల్‌ లేడీ తో రాజీ కి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ మొత్తంలో ఆమె కు డబ్బు చెల్లించి అయినా మికా సింగ్‌ పై కేసు విత్‌ డ్రా చేయిస్తామని అతడి స్నేహితులు హామీ ఇస్తున్నారు.

ప్రస్తుతాని కి దుబాయి జైల్లో ఉన్న మికా సింగ్‌ కేసు నిరూపణ అయితే తీవ్రమైన శిక్ష ను అనుభవించాల్సి వస్తుందని అక్కడ న్యాయ నిపుణలు చెబుతున్నారు. దుబాయిలోని ఇండియన్‌ ఎంబసి కూడా ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కోర్టులో కేసు ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసినట్లు గా చెబుతున్నారు. దాంతో మికా సింగ్‌ భవిష్యత్తు ఏంటా అంటూ ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News