ISRA సింగ‌ర్స్ అసోసియేష‌న్ మీటింగ్‌

Update: 2018-08-08 04:31 GMT
టాలీవుడ్‌ లో 24 శాఖ‌ల‌కు అసోసియేష‌న్లు ఉన్నాయి. కీల‌క‌మైన ఫిలింఛాంబ‌ర్‌ తో అనుసంధాన‌మై నిర్మాత‌ల మండ‌లి - మూవీ ఆర్టిస్టుల సంఘం - యాంటీ పైర‌సీ సెల్ - ఎఫ్ ఎన్‌ సీసీ ఇవ‌న్నీ ఒకే చోట ఉన్నాయి. ఇక ద‌ర్శ‌కుల సంఘం - జూ.ఆర్టిస్టుల సంఘం - ర‌చ‌యిత‌ల సంఘం - ఫైట‌ర్ల సంఘం - ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ల సంఘం.. ఇలా అన్ని సంఘాల ఆఫీస్లు శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ - కృష్ణాన‌గ‌ర్‌ - ఎల్లారెడ్డి గూడ ప‌రిస‌రాల్లో ఉన్నాయి. ఇలా ఎవ‌రికి వారికి సంఘాలున్నాయి. టాలీవుడ్ సింగ‌ర్ల‌కు - డ్యాన్స‌ర్ల‌కు అసోసియేష‌న్లు బ‌లంగా ఉన్నా వాటి గురించి తెలిసింది త‌క్కువే.

అయితే గాయ‌నీగాయ‌కుల్ని ఒకే వేదిక‌పై క‌లిపి వారి హక్కుల్ని కాపాడేందుకు ISRA (ఇండియ‌న్ సింగ‌ర్స్ రైట్ అసోసియేష‌న్‌) కృషి చేస్తున్న విష‌యం చాలా కొద్దిమందికే తెలుసు. `ఇస్రా` గాయ‌నీ గాయ‌కులంద‌రినీ ఒకే వేదిక‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇండియా లెవ‌ల్లో సింగ‌ర్స్ అసోసియేష‌న్ తొలి మీటింగ్ హైద‌రాబాద్‌ తాజ్ కృష్ణ‌లో నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక ఆద్యంతం గాయ‌నీగాయ‌కుల‌తో రంగుల మ‌యం కానుంది. టాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ‌ సింగ‌ర్స్ అంతా ఎటెండ్ అవుతున్నారు. ఈ వేదిక‌కు గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతున్నారు. సునీత‌ - ర‌మ్య బెహ‌రా - సౌమ్య‌ - హేమ‌చంద్ర‌ - శ్రావ‌ణ భార్గ‌వి - గోపిక పూర్ణిమ‌ - ర‌నీనా రెడ్డి - చిన్మ‌యి - ప్ర‌ణ‌వి - స్మిత‌ - కౌశ‌ల్య‌ - రాహుల్ - వెంగీ... ఇలా ప్ర‌ముఖ గాయ‌నీగాయ‌కులంతా ఎటెండ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

అయితే ఈ మీటింగ్‌ లో ఏ విష‌యాలు చ‌ర్చిస్తారు? అంటే .. గాయ‌నీగాయ‌కుల‌ హ‌క్కులు - వాటి ప‌రిర‌క్ష‌ణ అనే టాపిక్‌ పై విస్తృతంగా  చ‌ర్చిస్తార‌ట‌. అలానే సింగ‌ర్స్‌ కు ఉండే కాపీ రైట్స్ పై అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని తెలుస్తోంది. వేదిక‌పై ఉద్ధండులైన వ‌క్త‌ల ప్ర‌సంగాలు షురూ అయ్యాయి. ఇలాంటి ప్ర‌య‌త్నం మంచిదే... వ‌ర్ధ‌మాన గాయ‌నీగాయ‌కులకు ఇలాంటి చోట అంద‌రినీ క‌లుసుకునే అవ‌కాశం ఉంటుంది.
Tags:    

Similar News