కోవిడ్-19 ప్రభావంతో ఎన్నోప్రపంచ దేశాలతో పాటు భారతదేశం లో కూడా లాక్ డౌన్ పెట్టారు. దీంతో సాధారణ ప్రజలతో పాటుగా సెలబ్రిటీలు కూడా తమ ఇంటికే పరిమితం అయ్యారు. దాదాపు అందరూ స్టార్లు కరోనా నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెప్తూనే ఉన్నారు. ఈ సమయంలో జీక్యూ మ్యాగజైన్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది.
సహజంగా మ్యాగజైన్లు స్టార్ హీరోలతో.. స్టార్ హీరోయిన్లతో లేదా ప్రముఖ క్రికెటర్లతో ఫోటోషూట్లు చేస్తూ ఉంటాయి. జీక్యూ మ్యాగజైన్ గతంలో స్టార్లతో చేసిన కవర్ పేజీ షూట్లను కరోనా సమయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉపయోగించింది. సదరు ఫోటోలలో స్టార్ల మొహాలకు మాస్కులు వేసి కొత్త ఫోటోలు విడుదల చేసింది. అమీర్ ఖాన్ 'గజిని' గెటప్ లో ఉన్నప్పటి ఫోటోకు మాస్క్ వేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక షారూఖ్ ఖాన్.. ప్రియాంక చోప్రా..రణవీర్ సింగ్.. హసన్ మినాజ్.. విరాట్ కోహ్లీ లాంటి వారి ఫోటోలకు కూడా జీక్యూ మ్యాగజైన్ ఇలా మాస్కులతో కవర్ చేసి అందరినీ ఆకర్షించింది.
ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కుతోంది. ఈ ఫోటోలు ఒరిజినల్ ఫోటోలకన్నా అందంగా ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడడం విశేషం. చాలామంది నెటిజెన్లు ఇలా మాస్కుల వాడకంపై జీక్యూ మ్యాగజైన్ చేపట్టిన అవగాహనా కార్యక్రమంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుత సమయంలో స్టార్లకు ఫోటో షూట్లు చెయ్యడం వీలుకాదు.. అయినా ఇలా వినూత్నమైన ఆలోచనతో ముందుకువచ్చి అందరినీ ఆకర్షించడం విశేషమే. ఈ స్ఫూర్తి తో తెలుగు మ్యాగజైన్లు కూడా టాలీవుడ్ స్టార్లతో మాస్క్ ఫోటోలు ప్రచురిస్తాయేమో వేచి చూడాలి.