‘జెంటిల్ మన్’ సినిమా విషయంలో తనను నాని చాలా నెలలు వెయిట్ చేయించాడని అంటున్నాడు ఇంద్రగంటి. ఐతే అది సక్సెస్ వల్ల వచ్చిన పొగరుతో కాదని.. తనకు వీలు కాకపోవడం వల్లే సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యమైందని.. కానీ నాని ఎక్కువ టైం తీసుకోవడం తనకు మంచే చేసిందని ఇంద్రగంటి చెప్పాడు.
‘‘జెంటిల్ మన్ కథ గత ఏడాది మార్చిలో నానికి చెప్పాను. వెంటనే అతను ఓకే అన్నాడు. కానీ డిసెంబరు వరకు బిజీగా ఉంటా.. వెయిట్ చేస్తారా అని అడిగాడు. అమ్మో అంత వరకు ఆగాలా అనుకున్నాను. ఐతే నాని తప్ప ఈ సినిమా ఇంకెవరూ చేయలేరనిపించి వెయిట్ చేయాలనుకున్నా. ఇది తమిళ రచయిత డేవిడ్ నాథన్ రాసిన కథ కావడంతో మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తూ వెళ్లాను. ఇలా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి నాకు నవంబరు వరకు సమయం పట్టింది. ఆ తర్వాత నాని ఖాళీ అవ్వగానే సినిమా మొదలుపెట్టేశాం’’ అని ఇంద్రగంటి చెప్పాడు.
నాని ఆబ్లిగేషన్ మీద ఈ సినిమా చేయలేదని ఇంద్రగంటి అన్నాడు. ‘‘ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని లుక్ చూస్తే చాలా కొత్తగా అనిపించింది. ఈ కథకు అతనే న్యాయం చేయగలడనిపించింది. ఈ కథను.. నాని పాత్రను పేపర్ మీద రాసుకోవడానికే కష్టమైంది. మరి నాని ఎలా చేస్తాడో అనుకున్నాను. కానీ అతడు తప్ప ఇంకెవరూ చేయలేరు అనిపించేలా నాని యాక్ట్ చేసి చూపించాడు. ఇది కత్తి మీద సాములాంటి పాత్ర. ఏ మాత్రం అటు ఇటు అయినా కథలోనే బ్యాలెన్స్ తప్పుతుంది’’ అని ఇంద్రగంటి చెప్పాడు.