కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభనతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా స్తంభించిపోయింది. గతేడాది తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమ మళ్ళీ పుంజుకుంటోంది అనుకుంటుండగా.. వైరస్ ఉదృతితో అవే రోజులు పునరావృతం అవుతున్నాయి. అయితే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నా ఓ క్లారిటీ ఉంది.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. లాక్ డౌన్ పెడతారో లేదో అనే డైలామా ఉండటంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఇండస్ట్రీ జనాలు తికమకపడుతున్నారు.
ఇప్పటికే థియేటర్స్ క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా వేసుకున్నారు. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకు కోవిడ్ సోకడంతో సినిమా షూటింగులకి బ్రేక్స్ పడ్డాయి. ఆల్రెడీ పెద్ద సినిమాల షూటింగులు నిలిచిపోగా.. అక్కడక్కడ కొన్ని మిగతా చిత్రాల షూట్స్ మాత్రమే జరుగుతున్నాయి. అయితే ఈ షూటింగ్స్ కి కూడా డబ్బులు ఇస్తామన్నా సరే కరోనా భయంతో సినీ కార్మికులు, టెక్నీషియన్లు సెట్స్ కి రావడం లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టాలీవుడ్ లో కొందరు ఈ విపత్కర కాలాన్ని వాడుకొని సొమ్ము చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కరోనా సమయంలో కూడా షూటింగ్ కి రావడానికి ఒప్పుకొని, డబుల్ బేటాలతో నిర్మాతల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారట. దీని వల్ల ప్రొడ్యూసర్లకు రెండితల ఖర్చు అవుతోందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై క్లారిటీ లేకపోవడంతో ఖర్చు ఎక్కువే అవుతుంది కానీ తగ్గే ఛాన్స్ లేదని చెప్పవచ్చు.