అవకాశాలు ఇస్తామంటూ మభ్య పెట్టి, లోకల్ అమ్మాయిలనే కాదు ఇతర రాష్ట్రాలు నుంచి వస్తున్న వారిని కూడా మోసం చేసి లోభరుచుకునే పరిస్థితులు రోజు రోజుకి తెలుగు చిత్ర సీమలో ఎక్కువైపోతున్నాయి. ఎప్పటినుంచో ఈ విష సంస్కృతి ఇక్కడ ఉన్నా అదంతా తెరవెనుక వరుకే పరితమైయ్యేది. ఒకరినొకరు కలుసుకోకుండా మధ్యవర్తలు చేతులు మీదుగా ఈ వ్యవహారాలు సాగేవి.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మరింత వికటించి, ఏకంగా నిర్మాతలే స్వయంగా రంగంలోకి దిగి కోటి ఆశలతో ఫిల్మ్ నగర్ లో వాలుతున్న అమ్మాయిలకి గేలం వేసి తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇది చిన్న తరహా సినిమాలకే పరిమితం అనుకుంటే పొరపాటు పడినట్లే. స్టార్ నిర్మాతలుగా చలామణి అవుతున్న వారు ఈ రాకెట్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హీరోయిన్స్ గా రాణిస్తున్న వారిని హీరోయిన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నా వారిని కూడా ఆ ఛిటింగ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవలే ఓ రైజింగ్ హీరోతో సినిమా తీసి బాగా వర్క్ అవుట్ చేసుకున్న ఓ బడా నిర్మాత త్వరలో ఓ పెద్ద హీరోతో సినిమా మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మొత్తం ఫైనాన్సులు మీదనే సినిమా మొత్తాన్ని నడిపించే ఆ నిర్మాత తాజాగా అవకాశం కోసం వెళ్లిన ఓ బాంబే మోడల్ ని ఛాన్స్ కావాలంటే తనతో పాటు లక్నో రావాల్సిందిగా అడిగాడట.
అయితే ఇదంతా తెలియని ఆ బాంబే మోడల్ లక్నో ఎందుకు అని అడిగేసరికి అక్కడ ఫొటో షూట్ ఉందని మాయ మాటలు చెప్పాడట. అందుకు అంగీకరించి ఆ ఛిటింగ్ ప్రొడ్యూసర్ తో పాటు లక్కో వెళ్లేందుకు సిద్ధమైన ఆ బాంబే మోడల్ కి అసలు విషయం చివరి నిమషంలో ఆ నిర్మాతే చెప్పడం గమనార్హం. దీంతో చేసేదేమి లేక అతడితోపాటు లక్నో వెళ్లిన ఆ బ్యూటీ అక్కడ నుంచి తప్పించుకొని బాంబే పారిపోయినట్లుగా సమాచారం. ఇలాంటి వ్యవహారాల్లో ఇదో సాంపిల్ మాత్రమే అని ఇలాంటి కార్యకలపాలు పరిశ్రమలో అనేకం జరుగుతున్నాయని సినీజనాలు వాపోతున్నారు. అందరికీ తెలిసిన రహస్యాలు మాదిరిగా ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయని, అయినప్పటికి ఎవరికి వారు మోనంగా ఉంటున్నారని అంటున్నారు. మరి రానున్న రోజులు ఈ పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారతాయో చూడాలి!