టాలీవుడ్ లో బయోపిక్ కథాంశాలకు `మహానటి` ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఘనవిజయం సాధించాక వరుసగా బయోపిక్ లు తెరకెక్కాయి. ఎన్టీఆర్ .. వైయస్సార్ లపై బయోపిక్ లు వచ్చాయి. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ కథను తెరపై చూపిన ఆర్జీవీ.. ఇటీవల పవన్ కల్యాణ్ పై సెమీ లఘు చిత్రం తీసి ఏటీటీలో రిలీజ్ చేశారు. పనిలో పనిగా వరుసగా వివాదాస్పద జీవితకథల్ని ఎంచుకుని బయోపిక్ లు తీస్తున్నాడు అతడు. ఆర్జీవీ `మర్డర్` ఈ కేటగిరీనే. ఓటీటీ- ఏటీటీ అంటూ డిజిటల్ వేదికలు అందుబాటులో ఉండడంతో పరిమిత బడ్జెట్లలో పనవుతోంది. అందుకే ఆర్జీవీ బాటలోనే ఇంకెందరో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళంలో అమ్మ జయలలిత పై పలువురు బయపిక్ లు తెరకెక్కిస్తున్నారు. ఇవేకాదు.. పలువురు టాలీవుడ్ సినీప్రముఖులపైనా బయోపిక్ లు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. చాలా కాలంగా దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ గురించి చర్చ సాగుతోంది. దాంతో పాటే కత్తి కాంతారావు బయోపిక్ చిత్రీకరణ గురించి విధితమే. ప్రముఖుల జీవితాల్లో ఎమోషన్ పార్ట్ హైలైట్ గా ఎంచుకుని ఈ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. వీటిని ఓటీటీల్లో రిలీజ్ చేసే వీలుందని భావిస్తున్నారు.
ఉదయ్ కిరణ్ బయోపిక్.. ఆర్తి అగర్వాల్ బయోపిక్ లపైనా ఇటీవల చర్చ సాగుతోంది. ఆర్తి అగర్వాల్ బయోపిక్ పై గత ఏడాది కాలంగా టాక్ వినిపిస్తున్నా ఇప్పటికి సాధ్యమవుతోందట. ఇటీవల ఉదయ్ కిరణ్ బయోపిక్ ని తేజ తెరకెక్కించనున్నారని కథనాలు వేడెక్కించాయి. ఆ తర్వాత ఆర్జీవీ పేరు కూడా ఈ జాబితాలో వినిపించింది. `హృదయ్ కిరణ్` అనే టైటిల్ ని వర్మ ప్రకటించడంతో దానిపై చర్చ సాగింది. దాసరి నారాయణరావు.. ఆర్తి అగర్వాల్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు లైపో సర్జరీలు విఫలమై మరణించారన్న కథనాలు వచ్చాయి. అధిక బరువు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్సను ఆశ్రయించడం అది దుష్ప్రభావాలు చూపించి మరణం ఎదురవ్వడం అభిమానుల్లో ఎమోషన్ కి తావిచ్చింది. ఆయా ఎమోషనల్ ఘట్టాలు ఈ బయోపిక్ లపై ఆసక్తిని పెంచుతాయన్న చర్చా వేడెక్కిస్తోంది.