ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కలయికలో వచ్చిన చిత్రం `పుష్ప ది రైజ్`. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించిన బన్నీని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఊహలకందని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది.
సుకుమార్ - బన్నీల కలయిలో వచ్చిన మూడవ సినిమాగా వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రికార్డుల సునామీని సృష్టించి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురి చేసింది. మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రచారం చేయని ఉత్తరాదిలో ఈ మూవీ 100 కోట్ల మార్కుని దాటడం తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించి మరోసారి షాకిచ్చింది. బన్నీ వన్ మ్యాన్ షోగా ఊర మాస్ పాత్రలో నటించిన తీరు దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో ఈ మూవీకి దేశ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిసింది.
సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై రికార్డు స్థాయిలో స్టార్ సెలెబ్రిటీలు ప్రచారం చేయడం కూడా ఈ మూవీకి బాగా కలిసొచ్చింది. ఒక దశలో వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసినా `పుష్ప` మేనియా తారా స్థాయికి చేరింది. ఓటీటీలో విడుదలైనా సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీంతో వసూళ్లు అలాగే కొనసాగాయి. ఫస్ట్ పార్ట్ పై ఈ రేంజ్ లో క్రేజ్ ఏర్పడటంతో `పుష్ప 2` పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 2 అంతకు మించి వుంటుందని లీకులు మొదలు కావడంతో ప్రస్తుతం పార్ట్ 2 హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా వుంటే `పుష్ప 2`పై ఇంట్రెస్టింగ్ రూమర్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారాయి. `పుష్ప` ఊహకందని స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2 ని ముందు అనుకున్న విధంగా కాకుండా మరిన్ని మార్పులతో తెరపైకి తీసుకురావాలని సుకుమార్ ఇప్పటికే మార్పులు మొదలు పెట్టేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది.
`పుష్ప`లో మెయిన్ విలన్ గా మంగళం సీను పాత్రలో సునీల్, కొండారెడ్డి గా అజయ్ ఘోష్ కనిపించారు. అనసూయ దాక్షాయణిగా కనిపించినా పెద్దగా ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదు. ఇక ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గా ఎండింగ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫహద్ ఫాజిల్ పాత్ర కూడా కొంత వరకే కనిపించింది. ఈ ఇద్దరి పాత్రలని ప్రధానంగా చేసుకుని పార్ట్ 2ని నడిపించబోతున్నారట సుకుమార్. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పార్ట్ 2లో దాక్షాయణి, భన్వర్ సింగ్ షెకావత్ ఒక్కటిగా చేరి `పుష్ప`పై రివేంజ్ ప్లాన్ చేస్తారట. అందుకు `పుష్ప` నమ్మిన బంటు మోండేలు కేశవ సహకరిస్తాడట.
ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీవల్లి పాత్రని దాక్షాయణి అంతం చేస్తుందని, ఆ ప్లేస్ లో మరో బాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దింపేస్తారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాది వారిని ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగానే కొంత మంది బాలీవుడ్ నటీనటుల్ని సుకుమార్ పార్ట్ 2 కోసం దించేబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.