తెలుగులో ట్రావెలింగ్ నేపథ్యంలో నడుస్తూ ప్రేక్షకులను పలకరించిన కథలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ తరహా సినిమాల్లో ట్రావెలింగ్ చేసే వారితో కథ పరిగెడుతూ ఉంటుంది. కొత్త ప్రదేశాలను .. కొన్ని ఆనందాలను .. మరికొన్ని ఎమోషన్స్ ను పరిచయం చేస్తూ కథ సాగుతుంటుంది. ప్రేక్షకులు తెరపై ట్రావెల్ చేసే వారితో వెంటనే కనెక్ట్ అవుతారు. తాము కూడా వారితో కలిసి ఆయా ప్రదేశాలలో విహరిస్తుంటారు. వాళ్ల ఎమోషన్స్ ను షేర్ చేసుకుంటూ వెళుతుంటారు. అలాంటి ఒక కథతో తెలుగు తెరకి కథానాయకుడిగా అశోక్ సెల్వన్ పరిచయమవుతున్నాడు.
వయాకామ్ 18 స్టూడియోస్ వారు .. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాకి రా కార్తీక్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకి తెలుగులో 'ఆకాశం' అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళంలో 'నిత్తమ్ ఒరు వానమ్' టైటిల్ ను సెట్ చేశారు. తెలుగు టైటిల్ లుక్ పోస్టర్ ను నిన్న రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ దుల్కర్ తో ఈ పోస్టర్ ను రిలీజ్ చేయించడం విశేషం. గతంలో ఈ నిర్మాతలు దుల్కర్ తో 'కన్నుమ్ కన్నుమ్ కొల్లై యడిత్తాల్' సినిమాను తెరకెక్కించారు.
అప్పటి నుంచి ఈ నిర్మాతలకు దుల్కర్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా దుల్కర్ కి ఈ రెండు భాషల్లోను మంచి ఇమేజ్ ఉంది. అందువల్లనే ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ను ఆయనతో రిలీజ్ చేయించారు. ఈ సినిమాలో అశోక్ సెల్వన్ జోడీగా రీతూ వర్మ కనిపించనుంది. గతంలో ఈ బ్యానర్ వచ్చిన సినిమాలోనూ ఆమెనే కథానాయిక. ఇక ఇతర నాయికలుగా అపర్ణ బాలమురళి .. శివాత్మిక రాజశేఖర్ కనిపించనున్నారు. అపర్ణ బాలమురళి ఇంతకుముందు ఇక్కడ 'గద్దలకొండ గణేశ్' సినిమాలో అలరించింది. ఇక శివాత్మిక 'దొరసాని' సినిమాతో పరిచయమైంది.
ఇది ట్రావెలింగ్ కి సంబంధించిన కథ కావడం వలన అనేక ప్రదేశాలలో షూటింగు చేయవలసి ఉంటుంది . అలా ఈ సినిమాను హైదరాబాద్ .. చెన్నై .. వైజాగ్ .. మనాలి .. ఢిల్లీ .. గోవా .. చండీఘర్ .. కోల్ కతా .. పొల్లాచ్చి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. సాధారణంగా ఇలాంటి సినిమాలకు కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలంగా నిలుస్తుంటాయి. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చగా, విధు అయ్యన ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.