ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్లు ఇతర ప్రోమోస్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. రేపు శనివారం ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని 'సాహో' టీమ్ రీసెంట్ గా ప్రకటించారు. దీంతో అందరి దృష్టి 'సాహో' ట్రైలర్ పైనే ఉంది. ట్రైలర్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై ప్రేక్షకుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఈ చర్చల సంగతేమో కానీ 'సాహో' ట్రైలర్ గురించి ఫిలిం నగర్లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. 'సాహో' కథ చాలా నార్మల్ గా ఉంటుందట. కానీ దర్శకుడు సుజిత్ సింపుల్ గా ఉండే కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడట. ప్రతి పది నిముషాలకు ఒక ట్విస్టు ఇస్తూ.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు. రేపు రిలీజ్ కానున్న ట్రైలర్ దానికి శాంపిల్ లా ఉంటుందట.. ట్రైలర్ నిడివి రెండు నిముషాలకు పైగా ఉంటుందట. ట్రైలర్ లో సీజీ వర్క్ పర్ఫెక్ట్ గా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఓవరాల్ గా ట్రైలర్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని అంటున్నారు. 'సాహో' ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్ లో జరుగుతుందని.. ట్రైలర్ లాంచ్ తర్వాత మీడియాతో ప్రభాస్ ముచ్చటిస్తాడని సమాచారం. మీడియా ఇంటరాక్షన్ సాయత్రం నాలుగు గంటలకు ఉంటుందట.
దాదాపు రూ. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పలువురు బాలీవుడ్ నటులు.. సౌత్ ఇండస్ట్రీలకు చెందిన నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ ఈ సినిమాకు నేపథ్యం సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. మరి రేపు ట్రైలర్ తో మరోసారి జిబ్రాన్ తన మార్క్ చూపిస్తాడని ఆశించవచ్చు.