బాలీవుడ్ ప్రేక్షకులకు మాస్ ఐటెం సాంగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పాటల్లో ముందు ఉండే ఐటెం సాంగ్ మున్నీ బద్నాం.. ఈ పాట ఎంతటి పాపులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా సాంగ్ మాత్రం ఇంకా ఫ్రెష్ గానే ఉంది. ఇప్పటికి షో ల్లో ఈ పాట డాన్స్ లతో డాన్సర్ లు అదరగొట్టేస్తూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాలోని ఈ ఐటెం సాంగ్ ఎన్నో మాస్ ఐటెం సాంగ్స్ కు ఆర్శంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.
ఇంగ్లాండ్ లోని డిపార్ట్‌మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ న్యూ కరికులమ్ గైడ్ ను విడుదల చేసింది. ఇంగ్లాండ్ న్యూ మ్యూజిక్ కరికులమ్ లో కొన్ని ముఖ్యమైన పాటలను గీతాలను సంగీతాలను చేర్చడం జరిగింది. కేస్ స్టడీ కోసం అన్నట్లుగా పలు ఇండియన్ మూవీస్ కు చెందిన పాటలను కూడా వారు తీసుకోవడం జరిగింది. అందులో సల్మాన్ ఖాన్ దబాంగ్ ఐటెం సాంగ్ కు చోటు దక్కించుకుంది. హుషారెత్తించే పాటలను ఎలా ట్యూన్ చేయాలి శ్రోతల అభిరుచికి తగ్గట్లుగా హుషారు కలిగించేలా ట్యూన్స్ ఎలా కట్టాలి అనే విషయాన్ని విద్యార్థులకు నేర్పించడం కోసం వారు మన మున్సీ బద్నాం పాటను కేస్ స్టడీగా తీసుకున్నారు. ఇంకా రహమాన్ జయహో సాంగ్ కు కూడా ఈ గుర్తింపు దక్కింది.