న్యూ పోస్టర్: గన్ను పట్టుకున్న నందిత శ్వేత

Update: 2020-04-30 11:10 GMT
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నందిత శ్వేత తర్వాత చాలా సినిమాల్లోనే నటించింది కానీ చెప్పుకోదగ్గ హిట్ అయితే దక్కలేదు. ప్రస్తుతం ఈ భామ 'IPC 376' అనే సినిమాలో నటిస్తోంది. ఈరోజు నందిత పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 'IPC 376' టీమ్ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసి నందితకు బర్త్ డే విషెస్ తెలిపింది.

ఈ సినిమాలో నందిత ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఆ పాత్రకు తగ్గట్టే పోస్టర్ లో కూడా ఖాకి ప్యాంట్.. బ్లాక్ టీ షర్టు ధరించి.. చేతిలో పిస్టల్ పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్.. ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే ఎవరినో కాటికి పంపించాలనే మిషన్ తో ఉందనే సంగతి అర్థం అవుతోంది. ఈ సినిమా టైటిల్ లోనే ఫిలిం మేకర్లు స్టోరీ కొంత హింట్ ఇచ్చారు. అత్యాచారం నేరం చేసిన వారికి ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 376 ప్రకారం శిక్ష విధిస్తారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. టైటిల్ ఇలాంటిది పెట్టారు అంటే దానర్థం సినిమా కథ అత్యాచార సంఘటన చుట్టూ సాగుతుందని అనుకోవచ్చు.

ఈ సినిమాతో నందిత ప్రేక్షకులను మెప్పిస్తుందా.. తనకు తెలుగులోమంచి బ్రేక్ దక్కుతుందా అనేది వేచి చూడాలి. ఈ సినిమాకు రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకుడు కాగా ఎస్. ప్రభాకర్ నిర్మాత. ఈ సినిమాను పవర్ కింగ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళం- తెలుగు భాషలలో రిలీజ్ కానుంది.
Tags:    

Similar News