యూత్ ని మెప్పిస్తే.. పదే పదే థియేటర్లకు రప్పిస్తే కాసులు కురుస్తాయన్నది చాలా మంది మేకర్స్ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది. అందుకే యూత్ మెచ్చే అడల్ట్ కంటెంట్ తో ఇటీవల సినిమాలు వెబ్ సిరీస్ లు హోరెత్తిస్తున్నాయి. అయితే అన్ని సినిమాలు సిరీస్ లు ఒకేలా ఉంటే మళ్లీ బోరింగే.
యూత్ ని టెంప్ట్ చేయడం లో కూడా కొత్తదనం ఉండాలి. ఎంచుకున్న లైన్ కచ్ఛితంగా మునుపెన్నడూ చూడనిది అయ్యి ఉండాలి. అలాగే యూత్ ని ఆకర్షించే ఎలిమెంట్స్ మస్ట్. కానీ ఈ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు వచ్చేసినదే కదా! అనేస్తారు. `ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు` అన్న టైటిల్ తోనే టీనేజర్స్ యూత్ ఆకర్షణ నేపథ్యంలో ఆద్యంతం వేడి పెంచే చిత్రమిదని ట్రైలర్ చెబుతోంది. నవతరం తారలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. టీనేజీలో ప్రేమలు ఆకర్షణ అటుపై ఘాడమైన సన్నివేశాలతో ఈ మూవీ తెరకెక్కింది. పిల్లల పెంపకం అనే టాపిక్ ని కాస్త ఘాటుగానే చూపిస్తున్నారు. ట్రైలర్ లో కొన్ని ఘాటైన లిప్ లాక్ లతో నాయకానాయికలు చెలరేగిపోయారంటే సినిమా ఆద్యంతం ఇలాంటివి ఊహించవచ్చు. అయితే సన్నివేశాల్లో ఘాటు వరకూ ఓకే కానీ ఇందులో ఏం కథ చెప్పదలిచారు. కథనంలో గ్రిప్ ఎంత? అన్నది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతుంది.
కేవలం ఘాటైన సన్నివేశాల్లో జీవించినంత మాత్రాన ఆ నటీనటులకు గొప్ప పేరు ప్రయోజనం సమకూరుతుందనుకున్నా పొరపాటే. కనీసం బాక్సాఫీస్ వద్ద మెప్పించాలంటే ఏదో సంథింగ్ కథలో ఉండాలి. `ప్రయోజనాలతో సంబంధాలు`.. నచ్చినంత వరకు నచ్చినట్టుగా చేయడమే..ఆనందించడమే.. లాంటి డైలాగులు యూత్ కి కిక్కిచ్చేవే.. ఆర్గానిక్ పీస్ లాగా ఉన్నావ్.. ఫ్లాట్ కోస్తావా? .. అంటూ యూత్ పరిభాషను బాగానే పట్టేశారు. టెంప్టింగ్ క్వాలిటీ విజువల్స్ లో ఉన్నా థీమ్ విషయంలోనే జాగ్రత్త ఎంత? అన్నది థియేటర్లలోకి వచ్చాక కానీ తెలీదు. వై.యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హస్వంత్ వంగా- నమ్రతా దారేకర్మ- కటాలిన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు. తనికెళ్ల భరణి .. తులసి ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 6 న విడుదలవుతోంది.
Full View