తమిళ స్టార్ హీరో విక్రమ్.. గురించి సినీ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన విలక్షణ నటనతో దశాబ్దాల కాలంగా విక్రమ్ అభిమానులని అలరిస్తున్నాడు. విక్రమ్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తనని తను మలుచుకుంటాడు. 'శివపుత్రుడు' ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాడు. పాత్రకోసం విక్రమ్ రిస్క్ చేయడం ఇదేం కొత్త కాదు. ప్రస్తుతం విక్రమ్ కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అజయ్ ఈ సినిమా గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఇదివరకే నీటిలో తలకిందులుగా వేలాడే సీన్ గురించి చెప్పిన అజయ్.. ప్రస్తుతం ఈ సినిమాతో ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారట.
ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్ర కోసం ఇర్ఫాన్ పఠాన్ ఓకే చేసినట్లు తెలిపాడు. ఓ స్ట్రాంగ్ పర్సన్ కోసం వెతుకుతుండగా.. ఇర్ఫాన్ పఠాన్ టిక్ టాక్ వీడియో చూసి సెలెక్ట్ చేసినట్లు అజయ్ తెలిపాడు. ఇర్ఫాన్ మొదట్లో కాదన్నా కూడా తర్వాత ఓకే చేసాడట. మొదటి నుండి కూడా కోబ్రా సినిమాలో విక్రమ్ పాత్రలు ఎన్ని అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న సందేహం. అయితే ఈ కోబ్రాలో విక్రమ్ దాదాపు ఇరవై గెటప్ లలో కనిపించనున్నట్లు సమాచారం. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కాబట్టి క్యారెక్టర్ పరంగా హీరోకు ఇన్ని గెటప్‌లు అవసరం అయ్యాయని అంటున్నారు. కోబ్రా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుండే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్‌లు ఒక్కొక్కటీ వరుసగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా తర్వాత విక్రమ్.. మణిరత్నంతో ఓ మూవీ, కార్తీక్ సుబ్బరాజ్ మూవీలలో నటించనున్నాడు.