ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. అగ్ర హీరోలు స్టార్ డైరెక్టర్ల కలయికలో ఏ సినిమా తెరకెక్కినా అందులో పాన్ ఇండియా అప్పీల్ ఎంత? అన్నది సామాన్య ప్రేక్షకుల్లోనే చర్చ సాగుతోంది. రొటీన్ గా లోకల్ కంటెంట్ తో సినిమా తీస్తే థియేటర్లకు వెళ్లేందుకు జనం ఆసక్తిగా లేరు. లోకల్ కంటెంట్ అయితే టీవీలకు .. పాన్ ఇండియా (వరల్డ్) కంటెంట్ ఉంటే థియేటర్లకు అన్న చందంగా మారింది సీన్.
కారణం ఏదైనా కానీ కథ-కంటెంట్ - కాన్వాస్ అమాంతం మారిపోయాయి. సాధారణ దర్శకుడు అయినా తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి నేడు ఉంది. ఆచార్య తర్వాత కొరటాల తారక్ కోసం ఎలాంటి స్క్రిప్టును ఎంచుకున్నారు? అంటే.. ఆయన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశాన్ని ఎంచుకోవడం వెనక మర్మమిదే.
ఇప్పటికే కొరటాల స్క్రిప్ట్ చివరి ఫైనల్ వెర్షన్ రెడీ చేశాడు. అతను తుది మెరుగులతో లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే పూర్తి స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ కు వివరిస్తాడు. మరొక వైపు సాంకేతిక నిపుణులు ప్రస్తుతం ఖరారు చేస్తున్నారు. తాజాగా ట్యాలెంటెడ్ అనిరుధ్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అతడు ఇప్పటికే టాలీవుడ్ లో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ని అందించిన ప్రతిభావంతుడు. అజ్ఞాతవాసి- జెర్సీ- గ్యాంగ్ లీడర్ చిత్రాలకు చక్కని మ్యూజిక్ ని అందించాడు. ఇతర నటీనటులను కూడా పాన్ ఇండియా కేటగిరీవాళ్లనే ఎంపిక చేస్తారట. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్టులో కియారా అద్వానీ కథానాయికగా నటించనుంది. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.