బాలీవుడ్ కు 'బ్ర‌హ్మాస్త్ర‌'తో ఊర‌ట ల‌భించిన‌ట్టేనా?

Update: 2022-09-10 11:33 GMT
బాలీవుడ్ క్రేజీ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్‌, టాలెంటెడ్ హీరోయిన్ అలియా భ‌ట్ క‌లిసి న‌టించిన మూవీ 'బ్ర‌హ్మాస్త్రం'. యంగ్ డైరెక్ట‌ర్ అయాన్ ముఖ‌ర్జీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందించాడు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి ర‌ణ్ బీర్ క‌పూర్‌, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ మ‌రి కొంత మంది ఈ మూవీని నిర్మించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 9000 స్క్రీన్ ల‌లో అత్యంత భారీ స్థాయిలోవిడుద‌లైన ఈ మూవీకి ప్రారంభం నుంచి రాజ‌మౌళి ప్ర‌మోట్ చేయ‌డంతో మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఆ బ‌జ్ కి త‌గ్గ‌ట్టే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల ప్ర‌కారం ఈ మూవీ ఇండియా వైడ్ గా రూ. 35 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా వైర‌ల్డ్ వైడ్ గా ఫ‌స్ట్ డే రూ. 75 కోట్లు రాబ‌ట్టి న‌ట్టుగా చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

తాజా వ‌సూళ్ల‌ని బ‌ట్టి ఈ స్థాయిలో ఈ ఏడాది అత్య‌ధిక ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన భారతీయ సినిమాగా 'బ్ర‌హ్మాస్త్ర‌' రికార్డు సొంతం చేసుకుంద‌ని చెబుతున్నారు. ఈ మూవీ క‌లెక్ష‌న్స్ ని బ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాలు 'బ్ర‌హ్మాస్త్ర‌'తో బాలీవుడ్ కు బిగ్ రిలీఫ్ ల‌భించింద‌ని చెబుతున్నారు. సినిమా ఫ‌లితాన్ని ప‌క్క‌న పెడితే వ‌సూళ్ల ప‌రంగా నిజంగా 'బ్ర‌హ్మాస్త్ర‌' బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు అనే వాద‌న వినిపిస్తోంది.

గంగూబాయి క‌తియావాడీ, ది క‌శ్మ‌ర్‌ ఫైల్స్, భూల్ బులాయా 2' వంటి సినిమాల త‌రువాత ఆ స్థాయిలో బాలీవుడ్ నుంచి ఓపెనింగ్స్ ని రాబ‌ట్టిన సినిమా లేదు. తాజాగా 'బ్ర‌హ్మాస్త్ర' ఆ స్థాయి ఓపెనింగ్స్ ని టాక్ తో సంబంధం లేకుండా రాబ‌ట్ట‌డం విశేషం అని చెబుతున్నారు.

బాయ్ కాట్ ట్రెంట్ కొంత వ‌ర‌కు ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ని ప్ర‌భావితం చేసింది. అంతే కాకుండా కంగ‌నా ర‌నౌత్ లాంటి వాళ్లు సినిమాపై నెగ‌టివ్ ప్ర‌చారం చేస్తుండ‌టం మ‌రింత‌గా ప్ర‌భ‌వాన్ని చూపించే అవ‌కాశం క‌నిపిస్తోంది.  

ఈ సినిమాపై సోష‌ల్ మీడియా వేదిక‌గా రివ్యూ ఇచ్చిన కంగ‌న అంతా జీనియ‌స్ అంటున్న అయాన్ ముఖ‌ర్జీని వెంట‌నే జైల్లో వేయండి' అంటూ ఘాటుగా స్పందించింది. దీనికి నెటిజ‌న్ ల చేత కంగ‌న చివాట్లు తిన‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News