స్టార్ హీరో సినిమా అయినా.. చిన్ని హీరో సినిమా అయినా హంగామా మొదలయ్యేది ఆడియో.. టీజర్ లతోనే.. కానీ స్టార్ హీరో మహేష్ సినిమాకు అవే పెద్ద మైనస్ గా మారుతుండటం అభిమానుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `సరిలేరు నీకెవ్వరు`. ఈ సినిమా టీజర్.. సాంగ్స్ ఇప్పటికే రిలీజయ్యాయి. అయితే లిరికల్ వీడియోల్లో రొటీన్ మ్యూజిక్ అభిమానుల్ని కలవరపెడుతోంది. ఒక స్టార్ హీరో సినిమాకు ఏ స్థాయి హంగామా వుండాలో ఆ స్థాయి హంగామా సరిలేరు మ్యూజిక్ విషయంలో కనిపించడం లేదన్నది అభిమానుల ఆరోపణ. ఆ మేరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విమర్శలు చూస్తున్నదే.
మహేష్ సినిమా అంటే ఆడియో నుంచే హంగామా మొదలవుతుంది. కానీ సరిలేరుకు అదే పెద్ద డ్రాబ్యాక్ గా మారడం అంతుచిక్కడం లేదు. ఈ సినిమాకు పోటీగా బరిలోకి దిగుతున్న `అల వైకుంఠపురములో` చిత్రం పాటలు ఇప్పటికే జనాలల్లోకి వెళ్లిపోయి చార్ట్ బస్టర్స్‌లో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ మహేష్ సినిమా పాటలు మాత్రం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లకపోవడం మహేష్ అభిమానులకు అనుమానాలు కలిగిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత చిత్రాల స్థాయిలో దేవీ పాటలు ఇవ్వలేకపోవడం ఈ సినిమాకు ప్రధాన మైనస్ గా మారిందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇప్పటికే సరిలేరు నుంచి రెండు పాటలు రిలీజైతే ఆశించిన స్థాయి బజ్ రాకపోవడం చర్చకొచ్చింది.
తొలి మాస్ సాంగ్ పై తొలి విమర్శలు వచ్చాయి. ఇక రెండో పాట మెలోడియస్ గా సాగినా సాహిత్యం బాగా కుదిరినా .. మళ్లీ రొటీన్ ట్యూన్ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఆశించిన స్థాయిలో మ్యూజిక్ కుదురుతుందా.. లేదా.. ఆల్బమ్ లో ఇతర పాటలు ఎలా ఉన్నాయి? అన్న చర్చ సాగుతోంది. మునుముందు ఈ ఆల్బమ్ నుంచి మరో మూడు పాటలు రిలీజ్ కానున్నాయి. ప్రతి సోమవారం మాస్ ఎంబీ ట్రీట్ కి అభిమానులు ఎదురు చూస్తున్నారు. తదుపరి పాటలు ఎలా ఉండనున్నాయి? అన్నది చూడాలి అంటూ విశ్లేషిస్తున్నారు.