దిల్ రాజు కావాలనే 'విరాటపర్వం' చిత్రానికి పోటీగా 'పాగల్'ని తీసుకొస్తున్నాడా?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇకపై ప్రతి శుక్రవారం ఆసక్తికరమైన పోటీ ఉండనుంది. ఈ ఏడాది సంక్రాంతి మొదలుకొని వచ్చే సంక్రాంతి వరకు సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న దగ్గుబాటి రానా నటించిన 'విరాటపర్వం'.. విశ్వక్ సేన్ నటించిన 'పాగల్' సినిమాలు పోటీ పడనున్నాయి. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అయితే ఇప్పుడు 'పాగల్' సినిమాని కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు యాదృచ్చికంగా జరగలేదని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న 'పాగల్' సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ విడుదల తేదీని కూడా ప్రకటించారు. అయితే దిల్ రాజు కావాలనే 'విరాటపర్వం' చిత్రానికి పోటీగా నిలిపాడని అనుకుంటున్నారు. ఎందుకంటే 'విరాటపర్వం' డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను - దిల్ రాజు మధ్య ఇటీవల థియేటర్స్ కేటాయింపుల విషయంలో వైరం జరిగిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న 'క్రాక్' చిత్రానికి నైజాం ఏరియాలో దిల్ రాజు థియేటర్స్ ఇవ్వలేదని వరంగల్ శ్రీను పబ్లిక్ గా ఆరోపించాడు. ఈ ఇష్యూ ఫిలిం ఛాంబర్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'విరాటపర్వం' చిత్రానికి పోటీగా 'పాగల్' చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.