చాలా కాలం తర్వాత అక్కినేని అమల మేకప్ వేసుకుని ఫుల్ లెన్త్ రోల్ పోషించిన వెబ్ సిరీస్ హై ప్రీస్టెస్ జీ 5 ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే. ఎనిమిది ఎపిసోడ్లతో మొత్తం నాలుగు గంటల నిడివితో ఉన్న ఈ హారర్ థ్రిల్లర్ పట్ల అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నిన్నటి తరంలో అమల ఫ్యాన్స్ గా ఉన్నవారు బాగానే ఆసక్తి చూపించారు. ఇందులో అమల ఎంత వరకు మెప్పించారు అనే దాని గురించి వస్తున్న సందేహాలకు సమాధానం వచ్చేసింది.
ఇందులో అమల స్వాతి అనే టారెట్ కార్డ్స్ ఎక్స్ పర్ట్ గా నటించారు. దెయ్యాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి పేకాట తరహాలో చాలా పెద్ద సైజులో ఉండే కార్డులను పేర్చి అందులో తోచిన ముక్కలు తీసుకుని వాటి ద్వారా భవిష్యత్తుని చెప్పడమే ఈ విద్య. దీని ద్వారా నేరుగా దెయ్యాలతో సంభాషించి వాటి గతంలోకి కూడా వెళ్ళవచ్చు.
ఇందులో అమల ఇదే తరహాలో తనదగ్గరకు వచ్చే రకరకాల క్లయింట్స్ సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి తిరగబడి స్వాతి స్వంత కూతురిని కూడా చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి. స్వాతిని ఈ దెయ్యాల సావాసం తనను ఎక్కడిదాకా తీసుకెళ్లింది అనేదే అసలు కథ
మొత్తం ఎపిసోడ్ల వారీగా ఉన్న ఈ సిరీస్ లో ఒక్కోదాంట్లో ఒక్కో క్లయింట్ గురించి విభిన్నమైన పాయింట్ ఎంచుకున్నారు. కోర్టులో తప్పుడు కేసు వాదించి ఒకరి చావును ఉపయోగించుకున్న లాయర్ గా బ్రహ్మాజీ-ఓ వాషింగ్ మెషీన్ లో చనిపోయిన పాప ఆత్మగా మారి తన కొడుకుని టార్గెట్ చేస్తే తల్లడిల్లిపోయే తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా కాస్టింగ్ కూడా బాగానే వాడుకున్నారు. యాక్సిడెంట్ లో ఒక నపుంసకుడిని చంపేసి తప్పించుకువెళ్లిన కాలేజీ స్టూడెంట్ తరువాత అదే ఆత్మ ద్వారా జైలుకు వెళ్లడం-డాక్టర్ అయిన భర్త ఓ గర్భవతిని రేప్ చేసి హత్య చేస్తే ఆ తర్వాత దెయ్యం రూపంలో వచ్చిన ఆవిడ ద్వారా కళ్ళ ముందే అతన్ని పోగొట్టుకోవడం లాంటి థ్రిల్లింగ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి.
అయితే కిషోర్-అమల మధ్య ఫ్రెండ్ షిప్ ట్రాక్ సంభాషణలు బాగా సాగదీయడం కొంత విసుగు తెప్పిస్తుంది. అది మినహాయిస్తే మిగిలినదంతా హారర్ లవర్స్ కి బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. చాలా కాలం తర్వాత అయినా అమల ప్రీస్టేస్ గా మంచి నటన కనబరిచారు. కిషోర్ పర్వాలేదు అనిపించగా మిగిలిన తారాగణం సహజంగా నటించి మెప్పించారు