నేను స్లిమ్మయ్యాను అని చూపిస్తోందా!

Update: 2019-09-23 08:44 GMT
గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ కు ఈమధ్య బ్రేకప్ రూపంలో ఒక ఇబ్బంది వచ్చిపడింది. అయితే జనాలందరూ దాన్ని ఇబ్బంది అనుకుంటున్నారు కానీ ఇల్లీ బేబీకి మాత్రం అదేమీ పట్టినట్టు లేదు. ఒకవేళ బాధ మనసులోపల ఉందో ఏమో మనకు తెలీదు కానీ ఈమధ్య ఫిట్నెస్ పై ఫుల్లుగా ఫోకస్ చేసి.. డైటింగ్ మొదలుపెట్టి తన అధిక బరువుకు బ్రేకప్ చెప్పే ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉంది.

ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి ఏదైనా విశేషం ఉంటే చాలు.. క్షణమాత్రం ఆలస్యం చేయకుండా అభిమానులతో పంచుకుంటుంది..  తాజాగా అదే పని చేసింది.  ఒక స్మాల్ వీడియోను పోస్ట్ చేసి "కార్బో హైడ్రేట్స్ తినొచ్చు అని ట్రైనర్ చెప్పినపుడు నా మూడ్ ఇలా ఉంటుంది" అనే క్యాప్షన్ ఇచ్చింది.  ఇక వీడియోలో ఇల్లీ ఏం చేస్తోందంటే.. ఒక ఛోళి లెహంగా ధరించి అదో టైపు బెల్లీ డ్యాన్స్ లాగా రెండు చేతులను పైకెత్తి.. నడుమును వయ్యారంగా ఊపింది.  ఛోళీకి తళుకుబెళుకులు ఉండడంతో ఈజిప్షియన్ బెల్లీ డ్యాన్సర్ లాగా కనిపిస్తోంది. స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అయ్యేవారికి ఒకరోజు "మీ ఇష్టం.. ఏదైనా తినండి" అనే ఛాన్స్ ఇస్తే ఇలానే ఉంటుంది మరి. 

అయితే ఈ వీడియోను "నా ఆనందం చూడండి".. అని పోస్ట్ చేసినట్టుగా అనిపించడం లేదు.  "నేను స్లిమ్ అయ్యానహో.. నన్ను గుర్తించండహో" అనే సందేశాన్ని కళాపోషకుల సమాజానికి ఇస్తున్నట్టుగా ఉంది.  ఇక ఆ సమాజంలోనే ఫిలిం మేకర్లు ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.  సరే.. ఇదిలా ఉంటే నెటిజన్లు ఈ వీడియోకు భలేగా స్పందించారు.  "ఫన్నీ ఇలియానా".. "రాకింగ్ డ్యాన్స్".. "బ్రేకప్ అయితే ఇలాంటి డ్యాన్సా?".. "ఇల్లీ ఈజ్ బ్యాక్" అంటూ కామెంట్లు పెట్టారు.  సినిమాల విషయానికి వస్తే ఇల్లీ ప్రస్తుతం 'పాగల్ పంటి'.. 'ది రెడ్ బుల్' అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News