స్టార్ హీరో సినిమా 100 కోట్ల కామెడీ

Update: 2019-04-03 05:37 GMT
గత శుక్రవారం మలయాళంలో భారీ ఎత్తున విడుదలైన కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సినిమా లూసిఫర్ బ్లాక్ బస్టర్ టాక్ వసూళ్ళతో దూసుకుపోతోంది. అయితే దీని కలెక్షన్ల తాలుకు వివాదంతో మల్లువుడ్ మీడియా అట్టుడికిపోతోంది. కారణం లేకపోలేదు. కేవలం 6 రోజుల్లోనే దీనికి 100 కోట్లు వచ్చాయని ఓ ప్రముఖ పత్రిక ప్లస్ వెబ్ సైట్ లో రావడం అగ్గిని రాజేసింది. మొదటి ఐదు రోజులకు అరవై కోట్లు కలెక్ట్ చేసిన మూవీ కేవలం ఒక్క రోజులోనే నలభై కోట్లు ఎలా తెస్తుందనే లాజిక్ ని బయటికి తీయడంతో సదరు మీడియా సంస్థ ఆ ఆర్టికల్ ను తీసేసే దాకా వచ్చింది.

వాస్తవానికి లూసిఫర్ బాహుబలి లాంటి సినిమా ఏం కాదు. హీరోయిజం ని హై లైట్ చేస్తూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఓ కమర్షియల్ సినిమా. ఇంకా చెప్పాలంటే మన లీడర్-భరత్ అనే నేనులకు హంగులను జోడించి పకడ్భందీ కథా కథనాలతో దర్శకుడు పృథ్వి రాజ్ చేసిన మేజిక్ అన్నమాట. అయితే మరీ టూ ముచ్ గా మొదటి వారం పూర్తి కాకుండా ఇతర బాషలలో డబ్ చేయకుండా ఇంత సొమ్ము ఎలా వస్తుంది అన్న ప్రశ్న సంబద్దమే. అందుకే యూనిట్ సైలెంట్ గా ఉండి ఈ విషయంలో స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయించింది.

అధికారిక ప్రకటన కాదు కాబట్టి ఫ్యాన్స్ మా హీరో తప్పేమీ లేదు అంటున్నారు. ఇది కేరళలో కొత్త కాదు. మమ్ముట్టి మోహన్ లాల్ సినిమాలు వచ్చినప్పుడు ఇలా కలెక్షన్స్ వివాదాలు వస్తూనే ఉంటాయి. మోహన్ లాల్ వాటికే మరీ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు లూసిఫర్ కేసులోనూ ఇవి రిపీట్ కావడంతో యాంటీ ఫ్యాన్స్ ట్రాలింగ్ కు దిగిపోయారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే ఆ కుర్చీ కోసం కుటుంబం ఇంటా బయటా జరిగే హై డ్రామాతో లూసిఫర్ నడుస్తుంది. తెలుగులో డబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి
    

Tags:    

Similar News