స్మార్ట్ శంకర్ స్లాంగ్ వర్క్ అవుట్ అవ్వుద్దా ?

Update: 2019-07-12 05:21 GMT
ఇంకో వారం రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ హంగామా మొదలవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోలు తన కోసం వేచి చూసే రేంజ్ మైంటైన్ చేసిన పూరి జగన్నాధ్ గత కొన్నేళ్లుగా తన స్థాయి సక్సెస్ లేక మార్కెట్ పరంగా కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నాడు. అయినా ఇతన్ని అభిమానించే సినిమా ప్రేమికులకు కొదవ లేదు. అందుకే బలమైన సాలిడ్ కం బ్యాక్ కోసం ఫుల్ గా మసాలాలు దట్టించి ఇస్మార్ట్ శంకర్ ని రూపొందించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

లవర్ బాయ్ ని తలలు నరికే మాస్ అవతారంలో చూపించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే ఇందులో హీరో పాత్ర పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది. ఇతర పాత్రలు దాదాపు హైదరాబాద్ కల్చర్ లోనే సాగుతాయి. మరి ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలకు కనెక్ట్ అవుతుందా అనే అనుమానం ట్రేడ్ లో లేకపోలేదు. దానికి పూరి క్లారిటీ ఇస్తున్నాడు. ఆంధ్ర ప్రాంత సినిమాలు తెలంగాణలో బ్రహ్మాండంగా ఆడుతున్నప్పుడు అదే సూత్రం రివర్స్ లో కూడా వర్తిస్తుందని చెప్పాడు.

ఇందులో లాజిక్ ఉంది. పెళ్లి చూపులు-ఫిదా-అర్జున్ రెడ్డి లాంటివి తెలంగాణ యాసతో పాటు ఆయా ప్రాంతాల ఫ్లేవర్ ఉన్నా అన్ని ప్రాంతాల్లో ఆదరణ దక్కించుకున్నాయి. కానీ అవన్నీ లవ్ స్టోరీస్. ఇస్మార్ట్ శంకర్ పక్కా ఊర మాస్ యాక్షన్ మూవీ. సో వాటికన్నా ఒక బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి కంటెంట్ కనక కనెక్ట్ అయ్యేలా ఉంటె మాస్ ప్రేక్షకులే దీనిపై వసూళ్ల వర్షం కురిపిస్తారు. ట్రైలర్ చూసాక అలాంటి ఏకాభిప్రాయం పూర్తిగా కలగలేదు కానీ ఫైనల్ ప్రోడక్ట్ ఊహించని రేంజ్ లో ఉంటుందని టీమ్ ఊరిస్తోంది. చూద్దాం

    

Tags:    

Similar News