‘ ఆదిత్య 369’నే అటూ ఇటూ తిప్పుతున్నారా?

Update: 2021-04-08 09:30 GMT
బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉండచ్చు కానీ ,విభిన్నమైన చిత్రాలు అంటే ‘ ఆదిత్య 369’, ‘ భైరవద్వీపం’ మాత్రమే గుర్తు వస్తాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్,మరొకటి జానపదం. ముఖ్యగా  ‘ ఆదిత్య 369’కు ఇప్పటికి మళ్లీ మళ్లీ చూసే వీరాభిమానులు ఉన్నారు. టైమ్ మిషన్ కథాంశంగా 1991లో విడుదల ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుక్కర్లేదు.   తెలుగులో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆదిత్య 369 రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత సింగీతం సీక్వెల తీయాలని  ప్లాన్ చేసారు .కానీ ఎందుకో ముందుకు వెళ్లలేదు. అయితే తన బాబాయ్ చేసిన   ‘ ఆదిత్య 369’ లాంటి సినిమానే చేయాలని కళ్యాణ్ రామ్ కు చాలా కాలం నుంచి కోరిక ఉంది. అందుకోసం చాలా కాలంగా కథలు వింటూ వస్తున్నారు. ఆ మధ్యన ఒకటి లాక్ చేసారు.

వేణు మల్లిడి అనే కొత్త డైరక్టర్  చెప్పిన కథ ఇలాంటి పాయింట్ చుట్టూనే తిరుగుతుందిట. ఆ కథ  కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చింది. ఈ సినిమా టైమ్ మిషన్ నేపథ్యంలో ఉండటంతో కొద్ది పాటి మార్పులుతో వెంటనే ఓకే చేసాడట. ఇప్పుడున్న పరిస్దితులు, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా చేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఆ కథ ప్రకారం ప్రస్తుతం కాలానికి 500 సంవత్సరాలు వెనక్కి వెళతారట. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి భారీ సెట్స్ కూడా వేయాలని ఫిక్స్ అయ్యి..డిజైన్స్ రెడీ చేయిస్తున్నారట. సినిమా కథ ప్రకారం...గత కాలానికి వెళ్లి అక్కడో సమస్యలో పడి..దాన్ని పరిష్కరించుకుని బయిటపడటమే అంటున్నారు. అంటే పీరియడ్ లుక్ వస్తుంది. దాంతో తమ సినిమా డిఫరెంట్ గా ఉంటుందిట. అయితే టైమ్ మిషన్ కాన్సెప్టు ని మాత్రం యాజటీజ్ వాడటర. అలాంటి ఐడియాని ఇక్కడ ప్లే చేస్తున్నారట.

ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే ప్రాణం. కళ్యాణ్ రామ్ బడ్జెట్ పెట్టడం,సెట్స్ వేయిటం మీదే కాన్సర్టేషన్ కాకుండా స్క్రిప్టు మీద కూడా పూర్తి దృష్టి పెడితేనే ఇలాంటి సినిమాలు వర్కవుట్ అవుతాయి. తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమా చేస్తాడట. ఇదీ ఓ రకంగా ప్రయోగమే. దాంతో కథ ఓకే అయ్యి చాలా కాలం అయ్యినా మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడూ చేయిస్తూ,తను పూర్తిగా ఫెరఫెక్ట్ గా వచ్చిందనుకున్నాకే ముందుకు వెళ్ళాలని ముందే ఫిక్స్ అయ్యాడట. ఆ క్రమంలోనే కసరత్తు చేసారంటున్నారు. ప్లాఫ్ ల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కు మరో  ‘పటాస్’ లాంటి  హిట్  రావాలంటే కష్టపడాల్సిందే.  అలాగే   ‘ ఆదిత్య 369’ సినిమాకు సంబంధించిన చిరంజీవితో ప్రచారం చేయిస్తే.. మంచి రిజల్ట్ ఉంటుందని భావించి ఆయన్ని రిక్వెస్ట్ చేశారు. నిర్మాత అడంగానే వెంటనే చిరంజీవి ‘ఆదిత్య 369’ సినిమా యాడ్‌లో నటించి ఈ సినిమాకు ప్రచారం కల్పించారు. ఇప్పుడు బాలయ్య ని సీన్ లోకి తెస్తారేమో చూడాలి.
Tags:    

Similar News