క్వీన్ కంగన రనౌత్ ఏం చేసినా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కంగన నోటికి స్పీడెక్కువే కానీ ఎవరినైనా ఎదురించగలిగే ఆ గట్స్ ని ప్రశంసించని వాళ్లు లేరు. నోటి దురుసు తనను చిక్కుల్లో వేస్తున్నా కానీ తిరిగి ఇంతలోనే చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటూ తెలివైన భామ అని నిరూపిస్తోంది. దిగ్గజ రాజకీయ నాయకులతో వైరం కొనసాగిస్తున్న కంగన అటు బాలీవుడ్ మాఫియా పెద్దల్ని అంతే ధీటుగా ఎదురించి నిలుస్తోంది. ప్రత్యర్థికి కంటి మీద కునుకుపట్టనివ్వని దుందుడుకు కంగనకు ఆభరణం.
ఇలా క్వీన్ గురించి చెప్పుకుంటూ వెళితే ఒక రాజకీయ నాయకురాలు కావడానికి అవసరమయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని అంగీకరించాలి. ఇప్పటికే ప్రధాని మోదీకి.. భాజపాకు కంగన ఫాలోవర్ అన్న ముద్ర ఉండనే ఉంది. కాబట్టి మునుముందు రాజకీయాల్లోకి వస్తుందా? భాజపాలో చేరే ఆలోచన చేస్తోందా? అంటూ ఇప్పటికే బోలడంత చర్చ సాగుతోంది.
ఇక కంగన అన్ని రంగాల పెద్దలు ప్రముఖులతో సత్సంబంధాలను కొనసాగించడంలోనూ ఎప్పుడూ చాకచక్యం ప్రదర్శిస్తుంది. కంగనా రనౌత్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలుసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతిని కలిసిన సమయంలో కంగనా రనౌత్ నవ్వులు చిందిస్తూనే కనిపించింది. ముర్ము నుంచి ప్రశంసలకు కంగన తడిసిముద్దయిందిట. ఇక భారతదేశానికి ఒక మహిళ రాష్ట్రపతి కావడంపై ఇంతకుముందు కంగన ఎంతో ఎమోషనల్ అవ్వడమే గాక సుదీర్ఘ నోట్ ని రాసింది. ద్రౌపది ముర్ముతో గొప్ప సత్సంబంధాలను కంగన కొనసాగిస్తోంది. నిరంతరం వివాదాలు.. పెద్ద సౌండ్ చేసే నోరు.. పబ్లిసిటీ స్టంట్ బాగా తెలిసిన ఎవరైనా రాజకీయ నాయకులు కాగలరు. కంగనకు కూడా అలాంటి ఒక ఆప్షన్ ఉందని విశ్లేషిస్తున్నారు.
అవార్డులను వెనక్కిచ్చిన ధీశాలి!
తన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కకపోతే ఏ కళాకారిణి అయినా ఆవేదన చెందడం సహజం. కానీ కంగన పని తీరుకు గుర్తింపు దక్కింది. అద్భుత నటనతో ఆకట్టుకున్నందుకు అత్యుత్తమ అవార్డుకు నామినేట్ చేశారు. కానీ తననుంచి అనూహ్యమైన స్పందన ఎదురైంది. తనను అవార్డుకు నామినేట్ చేసినందుకు సదరు అవార్డుల కమిటీపై దావా వేస్తున్నానని హెచ్చరించింది. తనను నామినేట్ చేసినందుకు కంగన ఫిల్మ్‌ఫేర్ పై దావా వేస్తానని హెచ్చరించడం సంచలనమే అయ్యింది. అంతేకాదు.. ఫిలింఫేర్ ఉత్సవాలపై కంగన ప్రతిసారీ అనాసక్తతను కనబరుస్తోంది. అవార్డుల్లో నిజాయితీ లేదని కూడా సూటిగా విమర్శిస్తోంది. నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను తన ఖాతాలో వేసుకున్న కంగనా ఫిలింఫేర్ అవినీతిపై పదే పదే ప్రశ్నిస్తూనే ఉంటుంది.
క్వీన్ ముక్కుసూటితనం ఇండస్ట్రీ పెద్దలకు అసలే నచ్చదు. ముఖ్యంగా ఇండస్ట్రీ మాఫియాను ప్రశ్నించే తన తత్వం అసలే నచ్చదు. ఆమె ముక్కుసూటి వైఖరికి దుందుడుకు స్వభావానికి నోటి దురుసుకు పరిశ్రమలో అంతా శత్రువులుగా మారగా ఒక సెక్షన్ అభిమానులు మాత్రం కంగన ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తుంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.