థియేటర్ వ్యవస్థపై ఓటీటీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కోవిడ్ సమయంలో ఓటీటీ పుంజుకోవడం సహా..టిక్కెట్ ధరలు పెంచడంతో జనాలు థియేటర్ కి వెళ్లడం మానేసారు. కొన్ని వారాల పాటు ఆగితే ఓటీటీలో కుటుంబ సమేతంగా ఇంట్లోనే ఆసినిమాని ఆస్వాదించొచ్చు అన్న ధోరణి ఎక్కువగానే కనిపిస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో రేగిన గందరగోళమే అందుకు అతిపెద్ద సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇప్పుడా పరిస్థితుల నుంచి బయటపడి మళ్లీ జనాల్ని ఎలా థియేటర్ కి రప్పించాలని పెద్దలంతా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఆసంగతి పక్కనబెడితే...తాజాగా ఇలాంటి అంశాల్ని ముడిపెడుతూ బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్టార్..యాక్టర మధ్య వ్యత్యాసాన్ని చెప్పే ప్రయత్నం చేసింది.
'స్టార్ పవర్ ఆధారంగా సినిమాలు చేసే యుగం పోయింది. సినిమా భవిష్యత్ ని నిర్ణయించేది కథ అని.. దీన్ని గుర్తించి నటీనటుంతా మంచి కథలు ఎంచుకోవాలని హితవు పలికింది. కోవిడ్ పరిస్థితుల వల్ల ప్రజల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. వారిప్పుడు మంచి కంటెంట్ ని చూడాలనుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ డమ్ పై ఆధారపడే సినిమాలు చేస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. రచయితలు..దర్శకులు..నటులు అంతా చాలా విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా కథల్ని ఎంపిక చేసుకునే నటులు ఎక్కువగా పుస్తకాలు చ దవాలి. నాలెడ్జ్ పెంచుకోవాలి. నాకు తెలిసి ఈరోజు ఎవరూ స్టార్లు కాదు.
అందరూ నటులేనని'' చెప్పుకొచ్చింది. ఇటీవలే దిల్ రాజు కూడా ఇలాంటి ఎనాలసిస్ ఒకటిచ్చారు. కోవిడ్ ప్రజల్లో చాలా మార్పులు తెచ్చిందని..ఎలాంటి కథలు పడితే అలాంటి సినిమాలు ప్రేక్షకులు చూడటం లేదని..ఇన్నోవేటివ్ గా లోచిస్తున్నారన్నారు. ఖర్చు చేసిన రూపాయికి న్యాయం జరిగిందా? లేదా? అన్ని ఆలోచిస్తున్నారు.
అలాగే నిర్మాతలు కూడా ఈ విషయంలో మారాలని సూచించారు. కథలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు ఎలాంటి సినిమాలు అయితే వర్కౌట్ అవుతున్నాయో పూర్తిగా స్టడీ చేసి ..వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. దానికి సంబంధించి నిర్మాతలంతా ప్రత్యకేంగా సమావేశమయ్యారు. మంచి కథలతోనే మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని...అది ఎంత వీలైంత అంత తొందరగా చేయాలన్నారు.