ఈ మధ్య కాలంలో ప్రతీ సందర్భంలోనూ టార్గెట్ అయిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. 'మిర్చి' నుంచి 'భరత్ అనే నేను' బ్యాక్ టు బ్యాక్ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ లని అందించి తిరుగులేని రికార్డుని సొంతం చేసుకున్న దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకున్నారు.
అయితే ఇలాంటి ట్రాక్ రికార్డ్ వున్న కొరటాల శివకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో చేసిన 'ఆచార్య' భారీ షాకిచ్చింది. భారీ అంచనాల మధ్య తొలి సారి చిరు, చరణ్ కలిసి నటించిన ఈ ప్రాజెక్ట్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది.
దీంతో తీవ్ర అసంతృప్తిని గురైన మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ రిలీజ్ తరువాత పలు వేదికలపై దర్శకుడు కొరటాల శివ పై ఇండైరెక్ట్ గా సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కొంత మంది దర్శకుడు సెట్ లో సీన్ లు, డైలాగ్ లు రాస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని దానని మార్చుకోవాలని సెటైర్లు వేశారు. అంతే కాకుండా మరో ఈ వెంట్ లో మళ్లీ కొరటాల శివను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
తాజాగా 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ లోనూ అదే తరహాలో స్పందించిన చిరు ఆశ్చర్యపరిచారు. టీమ్ అందరి సమిష్టి కృషి వల్లే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని, అలా కాకుండా దర్శకుడు నేనే సుప్రీమ్, నాకే అన్నీ తెలుసు అని నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరూ తన పనిలో ఇన్ వాల్వ్ కావొద్దని భీష్మించుకుని కూర్చుంటే ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో రాదు. అంటూ మరోసారి ఇండైరెక్ట్ గా కొరటాలపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
అయితే చిరు మాటలు విన్న నెటిజన్స్ మాత్రం తప్పు ఒక్కరిపైపే వుందని చిరు.. కొరటాలని వేలెత్తి చూపడం ఏమీ బాగాలేదని 'ఆచార్య' డిజాస్టర్ కావడంలో ఇద్దరి పాత్ర వుందని సెటైర్లు వేస్తున్నారు. 'ఆచార్య' డిజాస్టర్ తరువాత చిరు తనకు లభించిన ప్రతీ వేదికపై కొరటాలపై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేస్తున్నా కొరటాల మాత్రం ఇప్పటికీ జెంటిల్ మెన్ లా వ్యవహరిస్తూ వుండటం పలువురిని ఆకట్టుకుంటోంది.
కొరటాల సమయం కోసం ఎదురుచూస్తున్నారా? లేక ప్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా? అన్నది గత కొన్ని నెలలుగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో ఇదే తరహాలో కొరటాలపై బోయపాటి శ్రీను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..దానికి కొరటాల సమయస్ఫూర్తితో కౌంటర్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. చిరు విషయంలోనూ కొరటాల ఇలాగే స్మార్ట్ గా వ్యవహరించి సమయం చిక్కగానే తనదైన స్టైల్లో స్పందించబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.