టాలీవుడ్ లో ప్లాప్ డైరెక్టర్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నాడు మెహర్ రమేష్. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మెహర్ రమేష్ కన్నడలో 'వీర కన్నడిగ' 'అజయ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. అయితే తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. 'కంత్రి' 'బిల్లా' 'శక్తి' 'షాడో' వంటి సినిమాలు రూపొందించి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. దీంతో నిర్మాతలు సైతం మెహర్ కి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు యాడ్స్ కి డైరెక్షన్ చేసిన మెహర్ రమేష్ 2013 తర్వాత మరో సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం రాలేదు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్లాప్ డైరెక్టర్ కి చిరు ఛాన్స్ ఇవ్వడంతో మెగా అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. చిరంజీవికి దగ్గరి బంధువైన మెహర్ రమేష్ టాలెంట్ ని నమ్మి ప్రాజెక్ట్ చేయడానికి మెగాస్టార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
కాగా మెహర్ రమేష్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన ''వేదాలమ్'' సినిమాని చిరంజీవితో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ - శృతి హసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి 'శౌర్యం' ఫేం శివ దర్శకత్వం వహించగా ఎ.ఎం రత్నం నిర్మించారు. సిస్టర్ సెంటిమెంట్ ని జత చేస్తూ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని చిరు భావిస్తున్నారట. ఇప్పటికే మెహర్ రమేష్ కి మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయమని సూచించాడట. ఇక ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు మరో నిర్మాత కలిసి నిర్మించనున్నారట. అయితే రీమేక్ సినిమాలు తీసి హిట్ కొట్టడం మెగాస్టార్ కి కొత్తేమీ కానప్పటికీ ప్లాప్ డైరెక్టర్ అనే ముద్ర ఏర్పరచుకున్న మెహర్ రమేష్ చిరుని హ్యాండిల్ చేయగలడా అని అభిమానులు కలవరపడుతున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.