సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. అయితే ఓవర్సీస్ లో మాత్రం సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిజానికి ఓవర్సీస్ మార్కెట్ మహేష్ కు మొదటి నుంచి స్ట్రాంగ్ జోన్. కానీ ఈ సారి మాత్రం మహేష్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ అదివారానికి యూఎస్ లో 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ $2.1 మిలియన్. సెకండ్ వీకెండ్ పూర్తయింది..ఇప్పటికే కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది కాబట్టి ఫుల్ రన్ లో 2.5 మిలియన్ చేరుకోవడం కూడా కష్టమేనని.. ఈ సినిమాకు నష్టం తప్పేలా లేదని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయినప్పటికీ.. భారీ స్థాయిలో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసినా.. మొదటి రోజు సోలో రిలీజ్ దక్కినప్పటికీ ఈ సినిమా నష్టాల దిశగా పయనించడం షాక్ ఇస్తోంది.
అంతే కాకుండా ఈ సినిమా అల్ టైమ్ టాప్-10 కలెక్షన్స్ లిస్టులో కూడా స్థానం సంపాదించలేకపోవడం గమనార్హం. అయితే సంక్రాంతి పోటీలో రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' మాత్రం ప్రస్తుతం టాప్ 10 లిస్టులో 7 వ స్థానంలో నిలిచింది. 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది కాబట్టి ఫుల్ రన్ లో కూడా టాప్ 10 లిస్టులో చేరడం దాదాపు కష్టమే. 2 మిలియన్ కు పైగా కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయమే కానీ మహేష్ కు ఓవర్సీస్ కింగ్ అని పేరుంది. అందుకే మహేష్ సినిమాలను భారీ రేట్ల కు అమ్ముతారు. అవి బ్రేక్ ఈవెన్ కావాలంటే భారీ స్థాయి కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. కానీ వాస్తవంలో అలా జరగడం లేదు. మహేష్ గత చిత్రం 'మహర్షి' టార్గెట్ అందుకోలేక పోయింది.. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ఇలా కొనసాగితే మహేష్ కు ఓవర్సీస్ కింగ్ అనే టాగ్ వదులుకోక తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.