మహేష్ ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తాడా ?

Update: 2019-06-01 06:59 GMT
నిన్న అట్టహాసంగా ప్రారంభమైన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ త్వరలోనే రెగ్యులర్ గా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. మహేష్ అందుబాటులో లేకపోయినా మంచి ముహూర్తం కావడంతో దిల్ రాజు అనిల్ సుంకరలు నిన్నే డేట్ ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మొన్న అర్ధ రాత్రి రిలీజ్ చేసిన టైటిల్ లుక్ లో మూడు బ్యానర్ల పేర్లు కనిపించడం నిజానికి మీడియా సైతం ఊహించనిది.

ఎందుకంటే మొన్నటి దాకా దీనికి నిర్మాతలు ఇద్దరే అని అందరూ అనుకున్నారు. కాని అనూహ్యంగా జి మహేష్ బాబు ప్రొడక్షన్స్ అని తన బ్యానర్ కూడా వేసుకోవడం ఒకరకంగా షాకే. నిజానికి మహేష్ శ్రీమంతుడు నుంచే వన్ అఫ్ ది ప్రొడ్యూసర్స్ గా ఉండటం స్టార్ట్ చేశాడు. కాని బ్రహ్మోత్సవం తర్వాత ఎందుకో మళ్ళి రూటు మార్చి హీరోకే పరిమితమయ్యాడు

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇక సరిలేరు నీకెవ్వరు నుంచి మహేష్ చాలా యాక్టివ్ గా ప్రొడక్షన్ పార్టనర్ గా మారబోతున్నట్టు తెలిసింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఇదే తరహాలో కెరీర్ పీక్స్ కు చేరుకున్నాక అత్యధిక సినిమాలు పద్మాలయ బ్యానర్ లోనే తీశారు. దర్శకత్వం కూడా చేశారు. అందులో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఒకరకంగా కృష్ణకు అది వెన్నుదన్నుగా నిలిచింది.

అదే స్ట్రాటజీతో మహేష్ కూడా జిఎంబి బ్యానర్ ను సుస్థిరం చేసే ప్లాన్ లో ఉన్నాడట. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ నమ్రతా శిరోద్కర్ చూసుకోబోతున్నారని తెలిసింది. సంక్రాంతి 2020కి విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు బిజినెస్ మహర్షిని దాటుతుందని ఇప్పటి నుంచే అంచనాలు మొదలైపోయాయి


    

Tags:    

Similar News