పుష్ప‌రాజ్ కోసం మున్నీని దించేస్తున్నారా?

Update: 2022-09-19 06:43 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ల క‌ల‌యిక‌లో ముచ్చ‌టిగా వ‌చ్చిన మూడ‌వ సినిమా 'పుష్ప ది రైజ్‌'. భారీ అంచనాల మ‌ధ్య హ‌డావిడీగా విడుద‌లైన ఈ మూవీ ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది. పార్ట్ 1 అనూహ్యంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకోవ‌డంతో పాన్ ఇండియా స్థాయిలో బ‌న్నీకి హ్యూజ్ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీ రిలీజ్ త‌ర‌వాత నుంచి త‌న‌కు ల‌భించిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్ అకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారి వ‌రుస క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ ల‌తో బిజీగా వున్నారు అల్లు అర్జున్.

ప్ర‌స్తుతం 'పుష్ప 2' కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీకి లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. ఫ‌స్ట్ పార్ట్ రికార్డు కార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో పార్ట్ 2 విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ముందు అనుకున్న‌ బ‌డ్జెట్ ని రెండింత‌లు చేసిన మేక‌ర్స్ పార్ట్ 2 కోసం రూ.350 కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్నార‌ట‌.

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న 'పుష్ప 2'పై గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే పార్ట్ 1 లో వున్న వాళ్ల‌తో పార్ట్ 2ని కొన‌సాగిస్తారా?  లేక కొత్త పాత్ర‌ల‌ని ఎంట‌ర్ చేస్తారా అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా 'పార్ట్ 1'లో స‌మంత చేసిన 'ఊ అంటావా..' స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. పార్ట్ 2 కోసం కూడా ఇలాంటి ప్ర‌త్యేక ఐట‌మ్ సాంగ్ ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడ‌ని, ఇందు కోసం ప‌లువురు బాలీవుడ్ క్రేజీ లేడీల‌ని ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఈ ప్ర‌త్యేక గీతం కోసం ఐట‌మ్ నంబ‌ర్స్ స్పెష‌లిస్ట్ మున్నీ .. మ‌లైకా అరోరాని దించేస్తున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే మేక‌ర్స్ నుంచి క్లారిటీ రానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే పార్ట్ 1 ని శేషాచ‌లం అడ‌వుల నేప‌థ్యంలో తెర‌కెక్కించాల‌ని సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ క‌రోనా కార‌ణంగా ఆ ప్లాన్ బెడిసికొట్టింది. చివ‌రికి మారేడుమిల్లి ఫారెస్ట్ లో పూర్తి చేయాల్సి వ‌చ్చింది. పార్ట్ 2 ని అలా కాకుండా భారీ స్కేల్ లో తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్న నేప‌థ్యంలో పార్ట్ 2 కోసం ఏ అడ‌విని ఎంచుకోవాల‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

 మ‌ళ్లీ మారేడు మిల్లి అడ‌వుల‌తో స‌రిపెట్టుకోవాలా?  లేక షూటింగ్ కు అనుకూలంగా వుండే విదేశాల్లోని అడ‌వుల్ని ఎంచుకోవాలా? అని చిత్ర బృందం ప్ర‌స్తుతం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంద‌ట‌.

స్టోరీ ఫైన‌ల్ అయిన నేప‌థ్యంలో లొకేష‌న్ లు ఫైన‌ల్ అయిన త‌రువాతే షూటింగ్ ని ప్రారంభించాల‌ని భావిస్తున్నార‌ట‌. అంతే కాకుండా హీరో కోసం బిగ్ హౌస్ సెట్ ని కూడా సెట‌ప్ చేయాల‌ని, దానికి సంబంధించిన షూట్ ని హైద‌రాబాద్ లోనే పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతా అనుకున్న‌ట్టుగా కుదిరితే ఈ మూవీని 2023 డిసెంబ‌ర్ లేదా 2024 స‌మ్మ‌ర్ కు రిలీజ్ చేయాల‌ని సుకుమార్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News