సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. బ్యాకింగ్ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిప్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
'సరిలేరు నీకెవ్వరు' మూవీ తరువాత మహేష్ నుంచి రానున్న సినిమా కావడం, ఈ మూవీ 'పోకిరి'వైబ్స్ ని కలిగిస్తోందరని స్వయంగా హీరో మహేష్ బాబు చెప్పడంతో అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ని మే 12న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డేట్ ని సినిమా వచ్చే అవకాశం కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
కారణం మహేష్ కు ఇటీవల మైనర్ ఆపరేషన్ జరిగింది. కొన్ని రోజులు దుబాయ్ లో విశ్రాంతి తీసుకున్నారు కూడా. దీంతో మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ కారణంగానే ఈ మూవీ అనుకున్న ప్రకారం మే 12న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కూడా చాలా టైమ్ పట్టే అవకాశాలు వుండటంతో ఈ చిత్ర రిలీజ్ ని మే ఎండికి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు వున్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలా వుంటే మే 12న వస్తే మహేష్ సినిమాకు మర్వెల్ మూవీ 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' రిలీజ్ కాబోతోంది. యుఎస్ లో ఈ మూవీ మే 6ప విడుదల కాబోతోంది. ఆ తరువాతే ఇండియాలో రిలీజ్ కానుంది. గతంలో 'భరత్ అనే నేను' సినిమా టైమ్ లో 'అవెంజర్స్ ఇన్ఫినిటీవార్' విడుదలై మహేష్ మూవీకి భారీ పోటీనిచ్చింది. ఆ తరువాత 'మహర్షి' టైమ్ లో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' విడుదలై మరింత దెబ్బకొట్టింది.
ఇప్పుడు 'సర్కారు వారి పాట' రిలీజ్ టైమ్ లోనూ ఇదే మార్వెల్ యూనివర్స్ నుంచి వస్తున్న 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' భారీ పోటీని ఇవ్వబోతోంది. మార్వెల్ వరల్డ్ మూవీస్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా యుఎస్ లో ఈ చిత్రానికి అత్యధిక థియేటర్లని కేటాయిస్తారు. అది 'సర్కారు వారి పాట'కు ప్రధాన సమస్యగా మారే అవకాశం వుందట. భరత్ అనే నేను యుఎస్ మార్కెట్ లో 3.5 మిలియన్ డాలర్లని కలెక్ట్ చేసింది. ఆ తరువాత 'మహర్షి' 2 మిలియన్ డాలర్లని రాబట్టింది.
ట్రిపుల్ ఆర్ రికార్డుని బ్రేక్ చేయాలంటే 5 మిలియన్ డాలర్లని రాబట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారట. అయితే 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' వీరికి గట్టి షాకిస్తోందని, ఆ కారణంగానే మహేష్ మూవీ మే నెలాఖరుకి రిలీజ్ అయితేనే బెటర్ అని మేకర్స్ తో పాటే అభిమానులు కూడా భావిస్తున్నారట.