మాస్ మహారాజా రవితేజ మునుపెన్నడూ లేనంతగా సినిమాల విషయంలో స్పీడు పెంచేసిన విషయం తెలిసిందే. జెట్ స్పీడుతో వరుస సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ ఏడాది రమేష్ వర్మ రూపొందించిన 'ఖలాడీ', శరత్ మండవ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'రామారావు అన్ డ్యూటీ' సినిమాలతో ప్రేక్షకుల ముందకొచ్చిన రవితేజ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయలేకపోయాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఖిలాడీ' మేకర్స్ కి లాభాల్ని తెచ్చిపెట్టినా రవితేజకు మాత్రం సక్సెస్ ని అందించలేకపోయింది.
ఇక ఆ తరువాత దర్శకుడు శరత్ మండవతో చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా రిలీజ్ కు ముందు భారీ హైప్ ని సొంతం చేసుకుని ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది. ఈ మూవీస్ తరువాత రవితేజ బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న 'రావణాసుర', వంశీ తెరకెక్కిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు', త్రినాథరావు నక్కిన తో 'ధమాకా' చిత్రాలు చేస్తున్నాడు.
ఈ మూడింటిలో కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ధమాకా' షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ , టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'పెళ్లిసందD' ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటి వరకు 'జింతాక్, మాస్ రాజా.. అంటూ సాగే లిరికల్ వీడియోస్ ని విడుదల చేశారు. దీపావళి బరిలో సినిమాని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు. సూపర్ బజ్ వుందని భావిస్తున్నారు. కానీ ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ కనిపించడం లేదు. ఈ సినిమా వున్నట్టుగానే ఆడియన్స్ ఫీలవడం లేదట. కారణం రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటంతో 'ధమాకా' ఇప్పటికే వారి దృష్టిలో రిలీజ్ అయినట్టుగా ఫీలవుతున్నారట.
ఈ నేపథ్యంలో ఆడియన్స్ కి ఈ సినిమా రిలీజ్ కానుందని తెలియాలన్నా, సినిమాపై మరింత బజ్ క్రియేట్ కావాలన్నా మేకర్స్ రిలీజ్ అప్ డేట్ ని అధికారికంగా ప్రకటించి హడావిడీ చేయాల్సందేనని చెబుతున్నారు. దీపావళి బరిలో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించకపోతే ఈ మూవీ దీపావళి రేస్ లో వున్నట్టా.. లేనట్టా అనే క్లారిటీ ప్రేక్షకుల్లో మిస్సయ్యే ఛాన్స్ వుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.