మాస్ రాజా మ‌ళ్లీ మ‌ళ్లీ అవే త‌ప్పులు చేస్తున్నాడా?

Update: 2022-04-20 00:30 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇటీవ‌ల 'ఖిలాడీ' చిత్రంతో బిగ్ షాక్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిపిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. అక్క‌డ కూడా సేమ్ ఫలితం ల‌భించింది. అయితే నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా మాత్రం ర‌వితేజ కు మంచి క్రేజ్ ని ఏర్ప‌రిచింది. గ‌త కొంత కాలంగా ర‌వితేజ న‌టించిన చిత్రాల‌కు నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా బాలీవుడ్ స‌ర్కిల్స్ లో మంచి డిమాండ్ వుంది.

అయితే థియేట్రిక‌ల్ రిలీజ్ ప‌రంగా మాత్రం ఆ క్రేజ్ లేదు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన 'ఖిలాడీ' చిత్రం రుజువు చేసింది. అయితే ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని ర‌వితేజ మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేయ‌డానికి రెడీ అయిపోతున్నాడ‌ని తెలిసింది. ర‌వితేజ చిత్రాల‌కు హిందీ మార్కెట్ లో నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ కు మంచి డిమాండ్ వుంది. కానీ థియేట్రిక‌ల్ బిజినెస్ మాత్రం అంత ఆశా జ‌న‌కంగా లేదు. అయితే ఈ విష‌యాన్ని ఆలోచించకుండా ర‌వితేజ త‌న చిత్రాల‌ని హిందీలో థీయేట్రిక‌ల్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ట‌.

త‌ను న‌టిస్తున్న చిత్రాల‌ని తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో రిలీజ్ చేయాల‌ని అడుగుతున్నాడ‌ట‌. నిర్మాత‌లు కూడా ర‌వితేజ డిమాండ్ కు అంగీక‌రిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం చేస్తున్నారు. శర‌త్ మండ‌వ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో పాటు మ‌రో మూడు చిత్రాలు కూడా లైన్ లో బ్యాక్ టు బ్యాక్ రెడీ అయిపోతున్నాయి.

సుధీర్ వ‌ర్మ తో 'రావ‌ణాసుర‌', త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ష‌న్ లో 'ధ‌మాకా' వంటి చిత్రాలు చేస్తున్నారు. ఇటీవ‌లే స్టూవ‌ర్టు పురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు జీవిత క‌థ ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని ర‌వితేజ మొద‌లుపెట్టారు.

రాకెట్ స్పీడుతో రూపొంద‌తున్న ఈ చిత్రాన్ని వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాల‌ని హిందీలో డ‌బ్ చేసి తెలుగుతో పాటు హిందీలోనూ థియేట్రిక‌ల్ రిలీజ్ చేయాల్సిందేన‌ని ర‌వితేజ నిర్మాత‌ల‌ని కోరుతున్నార‌ట‌. మాస్ రాజా చిత్రాల‌కు హిందీలో నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ బాగా వుండ‌టంతో థియేట్రిక‌ల్ రిలీజ్ పై ఆలోచ‌న‌లో ప‌డుతున్నార‌ట‌.

'ఖిలాడీ' ఫ‌లితం తెలిసి కూడా ర‌వితేజ ఎందుకిలాంటి త‌ప్పులు చేయ‌డానికి రెడీ అయిపోతున్నార‌ని,  ఇలా చేయ‌డం వ‌ల్ల భారీ న‌ష్టాలు రావ‌డం త‌ప్ప లాభాల్ని ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ర‌వితేజ కండీష‌న్ కు ప్రొడ్యూస‌ర్స్ సై అంటారా? .. లేదా అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News