2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. మెగా వర్సెస్ నందమూరి అన్నట్లుగా సాగిన సంక్రాంతి పోరు వచ్చే ఏడాది మరింత రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెగా కాంపౌండ్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మెగా హీరోలు ఇద్దరు వచ్చే ఏడాది సంక్రాంతి పై దృష్టి పెట్టారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్. ఇద్దరు కూడా సంక్రాంతికే తమ సినిమాలు తీసుకు రావాలని పోటీ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఆర్సీ15 సినిమా తో రామ్ చరణ్ ఈ ఏడాదిలో రావాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా యొక్క షూటింగ్ ఆలస్యం అవుతుంది. అందుకే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. పైగా దిల్ రాజుకు సంక్రాంతి సీజన్ కలిసి వస్తుంది. అందుకే రామ్ చరణ్.. శంకర్ మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇక సూపర్ హిట్ మూవీ పుష్ప యొక్క సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2 ను ఇటీవలే ప్రారంభించారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పుష్ప సినిమా యొక్క సీక్వెల్ ను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వారు భావిస్తున్నారు. మైత్రి వారు మొన్న సంక్రాంతికి రెండు సినిమాలతో వచ్చారు. కనుక వచ్చే సంక్రాంతికి కచ్చితంగా పుష్ప 2 ను తీసుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కేవలం ఈ మెగా హీరోల సినిమాలు మాత్రమే కాకుండా మరి కొన్ని పెద్ద హీరోల సినిమాలు మరియు ఇతర చిన్న సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి పై కన్నేశాయి. ఇంకా ఏడాది సమయం ఉండగానే కర్ఛీఫ్ ను వేసుకునేందుకు హీరోలు పోటీ పడుతున్నారు. రెండు మూడు నెలల్లో అధికారికంగా కూడా ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.