బిగ్ బాస్ సీజన్ 5 క్లైమాక్స్ కు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలే సాక్షిగా విజేత ఎవరో తేలబోతోంది. గత మూడవ సీజన్ ల నుంచి కింగ్ నాగార్జున ఈ షోకు షోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో హోస్ట్ గా విమర్శలు ఎదుర్కోని నాగార్జున ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విమర్శల పాలవుతున్నారు. ప్రత్యేకంగా కొంత మందిని మాత్రమే సపోర్ట్ చేయడం.. హౌస్ లో వున్న మిగతా వారిని టార్గెట్ చేయడంతో నాగార్జున విమర్శలు ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
నటి మాధవీలత తాజాగా నాగార్జునపై సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సిరి, షణ్ముఖ్ ల విషయంలో నాగార్జున వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇదే అంశంపై నటి మాధవీలత.. హోస్ట్ నాగార్జునపై విరుచుకుపడింది. సిరి, షణ్ముఖ్ ల తప్పుల్ని కప్పిపుచ్చుతూ వాళ్లది తప్పని చెప్పకపోగా వాళ్లు చేసిన తప్పుడు పనుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని, నాగార్జున హోస్టా లేక ఘోస్టా అని మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది. వారం మొత్తంలో జరిగే గేమ్ గురించి తెలుసుకోకుండా వీకెండ్ వచ్చి ఇచ్చిన పేపర్ చదివి వెళ్లిపోతున్నారని, హోస్ట్ గా ఏది తప్పు .. ఏది కరెక్ట్ అన్నది సూటిగా చెప్పడం లేదని కామెంట్ చేసింది. 3,4 సీజన్లతో పోలిస్తే హోస్ట్ గా నాగార్జున పూర్తిగా విఫలమయ్యాడని దుయ్యబట్టింది.
`నాగ్ మామా.. మీరు హోస్టా లేక ఘోస్టా ఎందుకు హోస్టింగ్ చేయకుండా అవమానకరంగా మాట్లాడుతున్నారు. మీరు కౌంటర్ వేశానని అనుకుంటున్నారు కానీ తప్పుల్ని కరెక్ట్ చేయలేని మీకు కౌంటర్ వేసే హక్కు లేదు. ఆ బుద్దిలేని వాడికి (షణ్ముఖ్) సపోర్ట్ చేస్తున్నప్పుడే అర్థమైంది మీరు కూడా అలాంటి వారే అని. ఇక లాస్ట్ వీక్ లో కాజల్ ని వెటకారం చేయడం ఏంటీ? .. సమాజానికి మీ ఛానల్ ద్వారా ఏం నేర్పిస్తున్నారు? .
చివరి వారంలో కూడా పక్షపాతాన్ని చూపిస్తున్నారు. హోస్ట్ అంటే ఎలా వుండాలో మీ కంటే చిన్నవాడైన ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకోరా? అని అనాలనిపిస్తోంది కానీ మీ ఏజ్ కి గౌరవం ఇచ్చి అనడం లేదు` అంటూ మాధవీలత సోషల్ మీడియా వేదికగా నాగార్జునపై ఫైర్ అయింది. ఆమె పెట్టిన పోస్ట్ లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.