బిగ్ బాస్ -తెలుగు తొలి రెండు సీజన్లు సాఫీగా సాగినా సీజన్ 3 విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. ఇన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ కొత్త సీజన్ విషయంలో వివాదాలు ఊపిరాడనివ్వడం లేదు. దీంతో ఈ సీజన్ ప్రారంభమవుతుందా? అవ్వదా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు కోర్టు కేసులు వేయడంతో ఇష్యూ సీరియస్ గా మారింది. యాంకర్ శ్వేతారెడ్డి.. నటీమణి గాయత్రి గుప్తా షో నిర్వాహకులపై కేసులు పెట్టడంతో పాటు దిల్లీ మహిళా కమీషన్ ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న ఉస్మానియా విద్యార్థులు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఓయూ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు. సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆ క్రమంలోనే రకరకాల వివాదాల నడుమ కొత్త సీజన్ ని ప్రారంభించేందుకు స్టార్ మా యాజమాన్యం ప్రయత్నిస్తుండగా సీన్ మరోసారి రివర్స్ అయ్యింది. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్‌బాస్ కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు నేడు మరోసారి ఆందోళన చేపట్టారు. ఆదివారం (జూలై 21)న ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగానే నేడు అన్నపూర్ణ స్టూడియోస్.. హోస్ట్ నాగార్జున ఇంటి వద్ద ఉస్మానియా విద్యార్థులు ముట్టడి చేయడం.. అటుపై సీన్ లోకి వచ్చిన పోలీసులు విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం పరిస్థితిని వేడెక్కించింది. ప్రస్తుతం నాగార్జున ఇల్లు .. స్టూడియో పరిసరాల్లో పోలీస్ బంధోబస్త్ కొనసాగుతోంది.
నేరుగా తన ఇంటినే విద్యార్థులు ముట్టడించడంతో ఈ సీజన్ కి హోస్టింగ్ చేయాలా వద్దా? అన్నదానిపై కింగ్ నాగార్జున డైలమాలో పడ్డారని.. ఈ విషయంపై స్టార్ మా నిర్వాహకులతో మంతనాలు సాగించారని ప్రచారమవుతోంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఇప్పటికి బిగ్ బాస్ 3 ప్రారంభం కాదన్న ప్రచారం సాగుతోంది. అయితే షో వాయిదా పైనా.. నాగార్జున హోస్ట్ గా తప్పుకున్నారన్న దానిపైనా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇప్పటివరకూ ప్రో కబడ్డీ ప్రకటన టీవీ చానెల్ లో ఎయిర్ అవుతున్నా.. `బిగ్ బాస్ 3` ప్రకటన మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆడియెన్ లోనూ సందేహం పుట్టుకొస్తోంది. ఈ సందిగ్ధతలన్నిటికీ స్టార్ మా యాజమాన్యం నేరుగానే ఆన్సర్ ఇస్తుందేమో చూడాలి.