తమిళనాడులో కాదు కేరళ గుడిలో పెళ్లి

Update: 2020-07-20 08:15 GMT
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార మరియు ఆమె ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ పెళ్లికి సిద్దం అవుతున్నారు. గత కొంత కాలంగా వీరి వివాహంపై చాలా రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నయన్‌ కెరీర్‌ పరంగా చాలా బిజీగా ఉండటం వల్ల పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇద్దరు కూడా గత రెండు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కరోనా పరిస్థితుల్లో స్టార్స్‌ పెళ్లిలకు ఆసక్తి చూపడం లేదు. కాని నయన్‌ మాత్రం ఈ సమయంలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.

కొన్ని వారాల క్రితం తమిళనాడులోని ఒక గుడిలో సాదా సీదాగా నయన్‌ పెళ్లి జులైలో జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఎప్పటి మాదిరిగానే నయన్‌ కాని విఘ్నేష్‌ కాని స్పందించలేదు. ఇప్పుడు మరో వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నయన్‌ వివాహం తమిళనాడులో కాదు కేరళలోని ఒక గుడిలో అమ్మడి వివాహంకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ  టాక్‌ వినిపిస్తుంది. ఈ నెలలోనే వీరి వివాహం జరుగబోతుందని కూడా అంటున్నారు.

నయన్‌.. విఘ్నేష్‌ ల కుటుంబాలకు చెందిన సన్నిహితులు మరియు స్నేహితులు అతి తక్కువ సంఖ్యలో హాజరు కాబోతున్న ఈ వివాహంకు మీడియాను కూడా ఆహ్వానించబోవడం లేదట. పెళ్లి పూర్తి అయ్యే వరకు అసలు వెన్యు ఎక్కడ అనే విషయాన్ని రివీల్‌ చేయరట. మీడియా అటెన్షన్‌ ఇష్టం లేని నయన్‌ ఇలా సింపుల్‌ గా పెళ్లిని చేసుకోవాలని భావిస్తుందట. మొత్తానికి నయన్‌ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News