జిల్ చిత్రంతో విజయం అందుకుని ప్రభాస్ కోసం ఏళ్ల తరబడి వేచి చూశాడు యువదర్శకుడు రాధాకృష్ణ. రాధేశ్యామ్ చిత్రాన్ని ప్రారంభించి ఇప్పటికే మూడేళ్లయ్యింది. రాధాకృష్ణ మొదటి సినిమా జిల్ 2015లో రిలీజైంది. ఆ తర్వాత రెండేళ్లు ప్రభాస్ కోసం కథ రాశాడు. 2018 చివరిలో రాధేశ్యామ్ పని మొదలైంది. అనంతరం ఫైనల్ స్క్రిప్ట్ ని ఓకే చేసేందుకే చాలా సమయం పట్టింది. చివరికి సెట్స్ కి వెళ్లాక.. చిత్రీకరణ పూర్తవుతున్న క్రమంలోనే 2020లో అతి పెద్ద క్రైసిస్ ఎదురైంది. కరోనా రంగ ప్రవేశం ఈ సినిమాని వేగంగా పూర్తవ్వకుండా బ్రేకులు వేసింది. బడ్జెట్ పైనా ప్రభావం చూపించింది. 2021లోనూ కొనసాగుతున్న క్రైసిస్ పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే రాధేశ్యామ్ రిలీజ్ తేదీని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
ఇంత సుదీర్ఘ కాలం ఇన్ని రకాల డైలమాల నడుమ రాధాకృష్ణ కుమార్ ఏమాత్రం పనితనం సడలకుండా ఔట్ పుట్ పరంగా అందరినీ మెప్పించాడా? ముఖ్యంగా తనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చిన ప్రభాస్ మెప్పు పొందాడా? ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్ తో ప్రభాస్ హ్యాపీయేనా? అంటే.. కాస్త వివరాల్లోకి వెళ్లాల్సిందే.
రాధే శ్యామ్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. అతి త్వరలో ఈ చిత్రం షూట్ తిరిగి ప్రారంభమవుతుంది. ఒక పాటను చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం మేరకు.. ఇప్పటికే ఈ మూవీ హార్డ్ కట్ పూర్తయింది. దానిని ప్రభాస్ ల్యాబ్ లో చూశారట. ఔట్ పుట్ ఆకట్టుకుంది. దర్శకుడు రాధా కృష్ణ పనితనం విషయంలో ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నాడు. పూజా హెగ్డే లుక్ .. ఈ చిత్రంలో నటీనటుల ప్రదర్శన ప్రతిదీ నచ్చాయట. రాధేశ్యామ్ టీమ్ నుంచి లీకైన విశేషాలివి. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని బహు భాషలలో విడుదల చేయనుంది. ఇటలీ నేపథ్యంలోని పీరియడ్ లవ్ స్టోరీ ఇది. బాలీవుడ్ ఆడియెన్ కి విపరీతంగా నచ్చేస్తుందన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. జూలై 30న ఈ చిత్రం రిలీజ్ కానుందా? అంటే నిర్మాణానంతర పనుల్ని బట్టి వీఎఫ్ ఎక్స్ కోఆర్డినేషన్ ని బట్టి డిసైడవుతుందని తెలిసింది.