ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో.. ఎవరిని ఓవర్ నైట్ స్టార్ ని చేస్తుందో ఇక్కడ ఎవరూ చెప్పలేదు. టైమ్ ని బట్టి సాగిపోవడమే. ఇప్పడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అదే పని చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని 'బద్రీ'గా చూపించి తన కెరీర్ కి తిరుగులేని సినిమాని అందించిన పూరి అదే తరహాలో రవితేజని స్టార్ ని చేశాడు. మహేష్ బాబుకు 'పోకిరి'తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ని అందించి స్టార్ హీరోల జాబితాలో చేర్చాడు.
అలాంటి పూరి ఇప్పడు తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ని ఫాలో అవుతున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో గౌతమ్ మీనన్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా చాలా మంది హీరోలకు మరపురాని హిట్ లని అందించాడు.
గత కొంత కాలంగా దర్శకుడిగా రేస్ లో వెనకబడిన గౌతమ్ మీనన్ నటుడిగా మారి ప్రాధాన్యత వున్న పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తొలి చిత్రం 'మిన్నాలే' నుంచి చిన్న గెస్ట్ క్యారెక్టర్లలో నటిస్తూ వచ్చిన గౌతమ్ మీనన్ 'గోలీ సోడా' నుంచి పూర్తి స్థాయి నటుడిగా కనిపించడం మొదలు పెట్టాడు.
ఇదే తరహాలో గౌతమ్ మీనన్ ని ఫాలో అవుతూ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నటుడిగా బిజీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ట్రెండ్ సెట్టర్ 'శివ'లో కాలేజీ బ్యాచ్ లో ఒకడిగా కనిపించిన పూరి 'యేమాయ చేసావే'లో డైరెక్టర్ గా, బిజినెస్ మెన్ లో ట్యాక్సీ డ్రైవర్‌గా, టెంపర్ లో బైకర్ గా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, లైగర్ సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన పూరి 'గాడ్ ఫాదర్' లో గోవర్ధన్ గా, ఓరి దేవుడా' మూవీలో తన నిజజీవిత పాత్రలో కనిపించి మెప్పించాడు.
ఇలా పూరి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో సడన్ సర్ ప్రైజ్ ఇస్తుండటంతో సినిమా కంటే యాక్టింగ్ పై దృష్టి పెడితే బాగుంటుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన 'లైగర్' మూవీలో ఎక్కడా పూరి మార్కు కనిపించకపోవడమే అంటున్నారు. ఇప్పటికీ విజయ్ దేవరకొండ అభిమానులు ఇదే విషయాన్ని నొక్కి మరీ చెబుతున్నారు.
పూరి తన మార్కు టేకింగ్ తో 'లైగర్' తీసి వుంటే కథ వేరేలా వుండేదని, అయితే అది ఏ ఫ్రేమ్ లోనూ కనిపించలేదని కామెంట్ లు చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా ఫ్లాపుల్లో వున్న పూరి నటుడిగా గౌతమ్ మీనన్ ని ఫాలో అవడమే కరెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాల నుంచి, నెటిజన్ ల నుంచి కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.