స్టార్ హీరోల్లో చాలా వరకు పాన్ ఇండియా ఫీవర్ వ్యాపిస్తోంది. ప్రతీ క్రేజీ స్టార్ పుష్ప, RRR ,కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ ల తరువాత జపిస్తున్న పదం పాన్ ఇండియా. అయితే 'పుష్ప' టీమ్ కు మాత్రం సీక్వెల్ ఫీవర్ అంటుకున్నట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. 'రంగస్థలం'తో సరికొత్త ఫార్ములాకు శ్రీకారం చుట్టిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ అదే పంథాను అనుసరిస్తూ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ కూలోడి కథగా ఈ మూవీ 'పుష్ప'ని తెరకెక్కించాడు.
భారీ అంచనాల మధ్య ఐదు భాషల్లో గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ఫస్ట్ పార్ట్ అనూహ్యంగా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా 'పుష్ప : ది రూల్' ని చేయబోతున్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ కావడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న తీమ్ ఈ మూవీని దీపావళి తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లబోతోంది.
ఫస్ట్ పార్ట్ రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంతో 'పుష్ప 2' ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని, భారీ బడ్జెట్ ని కూడా కేటాయించారు. రూ. 350 కోట్లకు మించి ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయబోతున్నారట.
'పుష్ప'ని ముందు రెండు భాగాలుగా తెరపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేయలేదు. అయితే చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకుని రెండు భాగాలుగా చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే దీన్ని రెండు భాగాలతో ఎండ్ చేయాలనే ఉద్దేశం సుకుమార్ కు, ఆయన టీమ్ కు లేదని తెలుస్తోంది.
పార్ట్ 2 ఎండింగ్ లో మరో భాగానికి లీడ్ ని వదలాలని సుకుమార్, ఆయన టీమ్ ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'కేజీఎఫ్ 2' ఫీవర్ కారణంగానే 'పుష్ప' టీమ్ సీక్వెల్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తోందని ఇన్ సైడ్ టాక్.
అయితే పార్ట్ 3 కి లీడ్ ఇచ్చే సీన్ కోసం ఇప్పడు కసరత్తు మొదలైందని, అది సెట్టయితే 'కేజీఎఫ్ 3' తరహాలో 'పుష్ప 3' ని కూడా తెరపైకి తీసుకొస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైనల్ క్లైమాక్స్ సీన్ కోసం 'పుష్ప' టీమ్, డైరెక్టర్ సుకుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.