పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్`. రాధా కృష్ణకుమార్ డైరెక్షన్‌లో అత్యంత భారీ స్థాయిలో యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్ర రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి జనవరి 14న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. కోవిడ్, ఒమిక్రాన్ కేసుల కారణంగా ఈ మూవీని వాయిదా వేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వరకు నిరుత్సాహానికి గురయ్యారు.
ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ పై పలు రకాల వార్తలు హల్ చల్ చేస్తుండటం, ఓటీటీలో ఈ మూవీ విడుదల దాదాపుగా ఖరారైపోయిందని, ఓ ప్రముఖ ఓటీటీ దిగ్గజం ఈ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరగడంతో దర్శకుడు సోసల మీడియా వేదికగా స్పందించి ఓటీటీ రిలీజ్ వార్తల్ని ఖండించారు. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం అంటూ `రాధేశ్యామ్` రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత ఈ చిత్ర రిలీజ్ కోసం రెండు రిటీజ్ డేట్ లు అనుకుంటున్నారనే వార్తలు షికారు చేశాయి.
మార్చి ఫస్ట్ వీకెండ్ లో కానీ సెకండ్ వీకెండ్ లో వచ్చే శుక్రవారం కానీ ఇదే తరహాలో ఏప్రిల్ లో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఈ మూవీ కోసం రెండు రిలీజ్ డేట్ లని ఫైనల్ చేశారంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. ఈ చిత్రాన్ని మార్చి 11న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ ని రెడీ చేసుకున్నారని తాజా టాక్.
టీ సిరీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని పక్కాగా ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది. పార్ ఇండియా మూవీస్ ఆ డేట్ లో పోటీకి లేకపోవడంతో మార్చి 11నే ఫైనల్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల కథనం. అంతే కాకుండా ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే అక్కడ విధించిన నైట్ కర్ఫ్యూని ఎత్తేసింది. అంతే కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా కొత్త టికెట్ రేట్లని ఫిబ్రవరి మొదటి వరాంలో ప్రకటించబోతోంది.
అందుకే `రాధేశ్యామ్` మేకర్స్ మార్చి 11ని ఎంచుకున్నారని చెబుతున్నారు. గత కొంత కాలంగా కోవిడ్ వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ మార్చి 11న ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోందట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ హస్తాసాముద్రికా నిపుణుడిగా కనిపించబోతున్నారు.