మాస్ మహారాజా రవితేజ బలమైన బౌన్స్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది మూడు మాస్ సినిమాలు చేస్తే ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్లుగా నిలవడంతో మార్కెట్ బాగా డ్యామేజ్ అయ్యింది. అభిమానులు ఎలాగోలా సర్దుకున్నా బయ్యర్లు మాత్రం మునుపటి లాగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఏ ఒక్కటీ కనీసం పది కోట్ల షేర్ రాబట్టలేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇదిలా ఉండగా ఆ మధ్య విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా మూవీని ఆర్భాటంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఇది క్రమం తప్పకుండ రెగ్యులర్ షూట్ లో ఉందనే అనుకున్నారు అందరు. అయితే ఫిలిం నగర్ టాక్ మాత్రం ఫాన్స్ తో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చేలా ఉంది
దాని ప్రకారం డిస్కో రాజాను తాత్కాలికంగా వాయిదా వేశారట. దాని స్థానంలో రెండేళ్ల నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ తో మైత్రి ఆఫీస్ లో రెడీగా ఉన్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో తేరి రీమేక్ వైపు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. కనకదుర్గ టైటిల్ తో రిజిస్టర్ చేశారనే ప్రచారం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
విజయ్ నటించిన తేరి రెగ్యులర్ పోలీస్ కమర్షియల్ మూవీ. కొత్తదనం ఏమి ఉండదు. కాకపోతే మాస్ హీరోయిజం బాగుంటుంది. డిస్కో రాజాను పక్కనపెట్టేంత ఎగ్జైటింగ్ అంశాలు అందులో ఉన్నాయా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఇది అధికారికంగా ప్రకటించింది కాదు కానీ టాక్ అయితే మహా జోరుగా ఉంది