వరస ప్లాపుల తో రేసులో వెనుకబడిన రవితేజ ప్రస్తుతం కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న 'క్రాక్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తో ఆకట్టుకున్న రవితేజ, గోపిచంద్ మలినేనిలు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. దీంతోపాటు రమేష్ వర్మ దర్శకత్వం లో 'కిలాడీ'అనే మూవీని లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో రవితేజ గురించి ఒక గాసిప్ వినపడుతోంది. మాస్ మహారాజ్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కాంఫ్రమైజ్ కావడం లేదంట. ఎన్నో అంచనాల తో విడుదలైన రవితేజ గత చిత్రం 'డిస్కోరాజా' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు రవితేజ భారీ మొత్తాన్నే వసూలు చేసాడని అప్పట్లో ఇండస్ట్రీలో అనుకున్నారు. ప్రస్తుతం నటిస్తున్న క్రాక్ సినిమాకి కూడా దాదాపు 10 నుండి 12 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడట. డిస్కోరాజా పరాజయం తర్వాత కూడా రవితేజ అంతే మొత్తాన్ని తన తదుపరి చిత్రాలకు డిమాండ్ చేస్తున్నాడంట. కోనేరు ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తున్న తన 67వ సినిమాకి కూడా దాదాపు 12 కోట్లు అడిగాడట. కొంచెం తగ్గించుకోమని ప్రొడక్షన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా హిందీ రైట్స్ వస్తున్నాయిగా అంటూ సమాధానం ఇస్తున్నాడట. వాస్తవానికి డిస్కోరాజా పరాజయం తర్వాత రవితేజ హిందీ రైట్స్ చాలా దారుణంగా పడిపోయాయంట. రవితేజ రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగితే మరో రెండు మూడు సినిమాల తర్వాత కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.