చాలా గ్యాప్ తర్వాత 'క్రాక్' సినిమాతో సక్సెస్ రుచి చూసిన మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. కాకపోతే సరైన ప్రమోషన్స్ చేయకపోవడంతో.. అవి జనాల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు హిందీ భాషల్లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి దూకుడుగా ప్రచార కార్యక్రమాలు చేయలేదనే టాక్ ఉంది. ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' విషయంలోనూ ఇదే జరుగుతోందని అంటున్నారు.
శరత్ మండవ అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రవితేజ నటిస్తున్న స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ "రామారావ్ ఆన్ డ్యూటీ". ఈ సినిమా నిర్మాణంలో మాస్ రాజా కూడా భాగమయ్యారు. జూలై 29న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది కానీ.. రవితేజ సినిమా ఒకటి ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ అవుతుందని ఎంతమందికి తెలుసనేదే ప్రశ్నార్థకంగా మారింది. విడుదల దగ్గర పడుతున్నా మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ స్పీడ్ పెంచడం లేదు.
దర్శకుడు మాత్రం తనవంతు బాధ్యతగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కానీ.. హీరోతో సహా మిగతా వారు సినిమాని పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. ఎంతో హడావుడి చేస్తే కానీ ఈ మధ్య జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇటీవల కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా జనాదరణ తెచ్చుకోలేకపోయాయి.
సో 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు మూడు వారాల కంటే తక్కువ సమయమే ఉంది కాబట్టి.. రాబోయే రోజుల్లో అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరముంది. 'ఖిలాడీ' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరైన ప్రమోషన్లు.. బజ్ లేకుంటే జనాలు థియేటర్లకు రావడం లేదని విషయాన్ని రవితేజ గ్రహించాలని సినీ అభిమానులు సూచిస్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాస్ రాజా ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.